Nizamabad | నవిపేట్.. యంచగుట్టపై బోనులో చిక్కిన చిరుత

Nizamabad | ఊపిరి పీల్చుకున్న నవిపేట్ మండల వాసులు విధాత ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని నవిపేట్ మండలంలో ప్రజలను వణికిస్తున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. యంచ, అల్జాపూర్ గుట్టలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో గుట్టపై ఉన్న చిరుత రాత్రి సమయంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో పడింది. ఉదయాన్నే గమనించిన గ్రామ సర్పంచ్ లహరి ప్రవీణ్.. అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. చిరుతను చూసేందుకు వందలాది […]

  • By: Somu    latest    Sep 09, 2023 12:44 AM IST
Nizamabad | నవిపేట్.. యంచగుట్టపై బోనులో చిక్కిన చిరుత

Nizamabad |

  • ఊపిరి పీల్చుకున్న నవిపేట్ మండల వాసులు

విధాత ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని నవిపేట్ మండలంలో ప్రజలను వణికిస్తున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. యంచ, అల్జాపూర్ గుట్టలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో గుట్టపై ఉన్న చిరుత రాత్రి సమయంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో పడింది.

ఉదయాన్నే గమనించిన గ్రామ సర్పంచ్ లహరి ప్రవీణ్.. అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. చిరుతను చూసేందుకు వందలాది మంది గుట్టపైకి వచ్చారు. పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు. చిరుతను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హైదరాబాద్ జూ పార్కుకు తరలిస్తామని రేంజ్ అధికారి పద్మా రావు తెలిపారు