Nizamabad Murder : మహిళ దారుణ హత్య..తల, చేతుల వేళ్లు నరికివేత
నిజామాబాద్‌లో మహిళ దారుణ హత్య. తల నరికి, వేళ్లు తెగగొట్టి మృతదేహాన్ని పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విధాత : నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. మొండెం లేని మహిళ మృతదేహం కలకలం రేపింది. మృతదేహానికి తల లేదు, చేతుల వేళ్లు సగం వరకు తెగి ఉన్నాయి. మహిళ మృతదేహాన్ని బాసర ప్రధాన రహదారి పక్కన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
హత్యకు గురైన మహిళ వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహం వివస్త్రగా ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. వేరే ప్రాంతంలో చంపి ఇక్కడ పడేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసు కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు మహిళలు హత్యకు గురవ్వడంతో పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram