Ration Cards | కొత్త రేషన్ కార్డులు జారీ చేయట్లేదు.. స్పష్టం చేసిన మంత్రి గంగుల
Ration Cards | ఈ నెల 21వ తేదీ నుంచి తెలంగాణ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు సోషల్ మీడియా వస్తున్న ప్రకటనలు, వార్తలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టత ఇచ్చారు. కొత్త రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. సోషల్ మీడియా, ఇతరత్రాచోట్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై వస్తున్న సమాచారం తప్పు అని ఆయన స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాలు, […]
Ration Cards |
ఈ నెల 21వ తేదీ నుంచి తెలంగాణ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు సోషల్ మీడియా వస్తున్న ప్రకటనలు, వార్తలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టత ఇచ్చారు.
కొత్త రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. సోషల్ మీడియా, ఇతరత్రాచోట్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై వస్తున్న సమాచారం తప్పు అని ఆయన స్పష్టం చేశారు.
గత కొన్ని రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా ప్రచారాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది అని వస్తున్న అసత్య ప్రచారాల్ని ఎవరు నమ్మొద్దని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా ఈ ప్రకటనలను ఎవరు ప్రచారంలోనికి తీసుకురావద్దని గంగుల కమలాకర్ సూచించారు.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram