Noida | విద్యార్థుల జుట్టు క‌త్తిరించిన టీచ‌ర్‌.. విధుల నుంచి తొల‌గింపు

Noida యూపీ నోయిడా ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఘ‌ట‌న‌ అడ్డ‌గోలుగా పెంచిన 13 మంది విద్యార్థుల‌కు స్వ‌త‌హాగా క‌ట్టింగ్‌ విధాత‌: కొంద‌రు విద్యార్థులు పోకిరీలుగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. జుట్టును అడ్డ‌గోలుగా పెంచుకొని స్కూళ్ల‌కు వ‌స్తుంటారు. జుట్టు స‌క్ర‌మంగా క‌త్తించుకోవాల‌ని ఉపాధ్యాయులు చెప్పినా చెవికి ఎక్కించుకోరు. పైగా వారిపైనే రుబాబు చేస్తారు. ఇష్ట‌మొచ్చిన హెయిల్ స్టైల్స్‌తో పాఠ‌శాల వాతావ‌ర‌ణాన్నిపాడుచేస్తారు. అలాంటి విద్యార్థుల‌కు బుద్ధి చెప్పింది ఓ టీచ‌ర్‌. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడా సెక్టార్ 168లో శాంతి ఇంట‌ర్నేష‌న్ స్కూల్ ఉన్న‌ది. అక్క‌డ స్కూల్ […]

Noida | విద్యార్థుల జుట్టు క‌త్తిరించిన టీచ‌ర్‌.. విధుల నుంచి తొల‌గింపు

Noida

  • యూపీ నోయిడా ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఘ‌ట‌న‌
  • అడ్డ‌గోలుగా పెంచిన 13 మంది విద్యార్థుల‌కు స్వ‌త‌హాగా క‌ట్టింగ్‌

విధాత‌: కొంద‌రు విద్యార్థులు పోకిరీలుగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. జుట్టును అడ్డ‌గోలుగా పెంచుకొని స్కూళ్ల‌కు వ‌స్తుంటారు. జుట్టు స‌క్ర‌మంగా క‌త్తించుకోవాల‌ని ఉపాధ్యాయులు చెప్పినా చెవికి ఎక్కించుకోరు. పైగా వారిపైనే రుబాబు చేస్తారు. ఇష్ట‌మొచ్చిన హెయిల్ స్టైల్స్‌తో పాఠ‌శాల వాతావ‌ర‌ణాన్నిపాడుచేస్తారు. అలాంటి విద్యార్థుల‌కు బుద్ధి చెప్పింది ఓ టీచ‌ర్‌.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడా సెక్టార్ 168లో శాంతి ఇంట‌ర్నేష‌న్ స్కూల్ ఉన్న‌ది. అక్క‌డ స్కూల్ డిసిప్లిన్ ఇన్‌చార్జ్‌గా సుష్మా అనే టీచ‌ర్ ప‌ని చేస్తున్నారు. అడ్డ‌మైన హెయిర్ స్టైల్స్‌తో స్కూల్‌కు వ‌స్తున్న విద్యార్థుల‌కు నెత్తి ట్రిమ్ చేసుకోవాల‌ని సుష్మా విజ్ఞ‌ప్తి చేశారు. ఆయా విద్యార్థుల‌ను స‌క్ర‌మంగా క‌ట్టింగ్ చేసుకోవాల‌ని ప‌లు సంద‌ర్భాల్లో హెచ్చ‌రించారు.

అయినా, ఆమె వినతిని విద్యార్థులు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. అలాగే స్కూల్‌కు విద్యార్థులు వ‌స్తుండ‌టంపై టీచ‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. బుధ‌వారం నాడు అడ్డ‌గోలుగా జుట్లు పెంచుకున్న8-12 త‌ర‌గతులు చ‌దివే 15 మంది విద్యార్థుల‌కు స్వ‌యంగా క‌త్తెర‌తో సుష్మా టీచ‌ర్ క‌ట్టింగ్ చేశారు. మిగ‌తా విద్యార్థుల‌కు బుద్ధి వ‌స్తున్న‌ద‌ని క్ర‌మ శిక్ష‌ణతో ఉంటార‌ని టీచ‌ర్ భావించారు.

పిల్ల‌ల‌కు క్ర‌మ‌శిక్ష‌ణ నేర్పిన టీచ‌ర్ సుష్మాను అభినందించాల్సింది పోయి.. విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఏకంగా ఆందోళ‌నకు దిగారు. టీచ‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. త‌మ పిల్ల‌ల‌కు క‌టింగ్ చేయ‌డానికి ఆమె ఏవ‌రంటూ నిల‌దీశారు. పోలీసుల‌కు సైతం ఫిర్యాదు చేశారు. దాంతో పాఠ‌శాల యాజ‌మాన్యం సుష్మా టీచ‌ర్‌ను విధుల నుంచి తొల‌గించింది. గిట్ల ఉంట‌ది మ‌నద‌గ్గ‌ర‌.. మంచిచేయ‌బోతే చెడు ఎదురైదంటే ఇదే కావ‌చ్చు.