North Korea | మూడేండ్ల తర్వాత చైనాకు.. ఉత్తర కొరియా వాణిజ్య విమానం
కొవిడ్ కారణంగా 2020 నాటి నుంచి సరిహద్దులు మూసివేసిన కిమ్ North Korea | విధాత: ఉత్తర కొరియాకు చెందిన అంతర్జాతీయ వాణిజ్య విమానం మూడేండ్ల తర్వాత తొలిసారిగా మంగళవారం చైనాలో అడుగుపెట్టింది. కొవిడ్ -19 (Covid-19) మహమ్మారి కారణంగా 2020 నాటి నుంచి ఉత్తర కొరియా తన సరిహద్దులను మూసివేసింది. చాలావరకు బయటి ప్రపంచం నుంచి దూరంగా జరిగింది. ఎయిర్ కొరియో ఫ్లైట్ జేఎస్ 151 (Flight JS151)మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఉత్తర కొరియా […]
- కొవిడ్ కారణంగా 2020 నాటి నుంచి సరిహద్దులు మూసివేసిన కిమ్
North Korea |
విధాత: ఉత్తర కొరియాకు చెందిన అంతర్జాతీయ వాణిజ్య విమానం మూడేండ్ల తర్వాత తొలిసారిగా మంగళవారం చైనాలో అడుగుపెట్టింది. కొవిడ్ -19 (Covid-19) మహమ్మారి కారణంగా 2020 నాటి నుంచి ఉత్తర కొరియా తన సరిహద్దులను మూసివేసింది. చాలావరకు బయటి ప్రపంచం నుంచి దూరంగా జరిగింది.
ఎయిర్ కొరియో ఫ్లైట్ జేఎస్ 151 (Flight JS151)మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ నుంచి బయలుదేరి 9.17 గంటల ప్రాంతంలో బీజింగ్ (Beijing) విమానాశ్రయంలో దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి తగ్గడంతో ఉత్తర కొరియా కిమ్ సర్కార్ సరిహద్దుల వద్ద నియంత్రణలకు సడలింపులు ఇచ్చింది. దాంతో దేశంలోకి రాకపోకలకు కొంత అనువైన వాతావరణం నెలకొన్నది.
గత నెలలో ఉత్తర కొరియా రాజధానిలో నిర్వహించిన సైనిక కవాతుకు చైనా, రష్యా అధికారులుహాజరయ్యారు. కొన్నేండ్ల తర్వాత దేశాన్ని సందర్శించిన మొదటి విదేశీ ప్రముఖులు వీరే కావడం విశేషం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram