నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: వ్యవసాయ, విద్యాశాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
విధాత, హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయశాఖ, విద్యా శాఖల్లో పలు పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేర్వేరుగా నోటిఫికేషన్లను జారీ చేసింది. వ్యవసాయశాఖలో 148 వ్యవసాయ అధికారి పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 100 మల్టీజోన్-1 పోస్టులు, మల్టీజోన్-2లో 48 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. జనవరి 10వ తేదీ నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అలాగే విద్యాశాఖలో […]

విధాత, హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయశాఖ, విద్యా శాఖల్లో పలు పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేర్వేరుగా నోటిఫికేషన్లను జారీ చేసింది. వ్యవసాయశాఖలో 148 వ్యవసాయ అధికారి పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
100 మల్టీజోన్-1 పోస్టులు, మల్టీజోన్-2లో 48 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. జనవరి 10వ తేదీ నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అలాగే విద్యాశాఖలో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.
సాంకేతిక విద్యాశాఖలో 37, ఇంటర్మీడియట్ విద్యాశాఖలో 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 6 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వివరించింది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ http://tspsc.gov.inలో సంప్రదించాలని కోరింది.