నా భర్త మగాడు కాదు.. పోలీసులకు భార్య ఫిర్యాదు
విధాత: మొదటి భర్తను రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన ఓ మహిళ.. మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. రెండో భర్తతో కలిసి హనీమూన్‌కు కూడా వెళ్లింది. కానీ అతను శృంగారానికి దూరంగా ఉన్నాడు. అప్పుడు కూడా ఆమెకు అనుమానం రాలేదు. ఏదో ఒక కారణం చెప్పి శృంగార జీవితానికి దూరంగా ఉంటున్నాడు. ఎట్టకేలకు ఎనిమిదేండ్ల తర్వాత అతను మగాడు కాదని భార్య గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ వడోదరకు చెందిన 40 ఏండ్ల మహిళకు […]

విధాత: మొదటి భర్తను రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన ఓ మహిళ.. మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. రెండో భర్తతో కలిసి హనీమూన్‌కు కూడా వెళ్లింది. కానీ అతను శృంగారానికి దూరంగా ఉన్నాడు. అప్పుడు కూడా ఆమెకు అనుమానం రాలేదు. ఏదో ఒక కారణం చెప్పి శృంగార జీవితానికి దూరంగా ఉంటున్నాడు. ఎట్టకేలకు ఎనిమిదేండ్ల తర్వాత అతను మగాడు కాదని భార్య గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ వడోదరకు చెందిన 40 ఏండ్ల మహిళకు తొలిసారిగా 90లలో వివాహమైంది. 2011లో ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటికే ఆమెకు 14 ఏండ్ల కుమార్తె ఉంది. తనకు ఒకరు తోడు కావాలని భావించిన ఆ మహిళ.. ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన విరాజ్ వర్ధన్ అనే వ్యక్తిని 2014, ఫిబ్రవరిలో వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిగింది.
అనంతరం ఆ జంట హనీమూన్‌కు కశ్మీర్‌కు వెళ్లింది. కానీ అతను శృంగారానికి దూరంగా ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత శృంగారం చేద్దామని చెప్పి.. హనీమూన్‌లో సమయాన్నివృధా చేశాడు. ఇంటికి తిరిగొచ్చారు. అయినా కూడా అతను శృంగారానికి దూరంగా ఉంటున్నాడు. దీంతో భార్య అతనిపై ఒత్తిడి చేసింది. తనకు కొన్నేండ్ల క్రితం రష్యాలో యాక్సిడెంట్ జరిగిందని, దాని కారణంగా శృంగార జీవితానికి దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చాడు.
ఇక తాను బరువు తగ్గేందుకు శస్త్ర చికిత్స చేయించుకుంటానని చెప్పి 2020లో విరాజ్ వర్ధన్ కోల్‌కతాకు వెళ్లాడు. అప్పుడు అసలు విషయం బయటపడింది. తాను కోల్‌కతాలో లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నానని, తాను గతంలో అమ్మాయినని విరాజ్ చెప్పడంతో.. భార్య షాక్‌కు గురైంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన భర్త మగాడు కాదని, లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఎనిమిదేండ్ల కాలంతో తనతో అసహజ శృంగారం చేశాడని, ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయభ్రాంతులకు గురి చేశాడని పోలీసుల ఎదుట బాధితురాలు వాపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.