వృద్ధుడి సైకిల్ స్టంట్లు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Cycle Stunt | ఏదైనా సాధించాలన్న సంకల్పం ఉంటే చాలు.. వయసు అడ్డు రానే రాదు. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే. 60 ఏండ్ల వయసున్న ఓ వృద్ధుడు సైకిల్ స్టంట్లు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వృద్ధుడి సైకిల్ స్టంట్ల వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే. వాహనాలతో రద్దీగా ఉన్న ఓ రహదారిపై వృద్ధుడు తన సైకిల్‌పై అతి వేగంగా దూసుకెళ్తున్నాడు. హ్యాండిల్‌ను వదిలేసి.. సైకిల్‌పై దూసుకెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హ్యాండిల్‌ను […]

Cycle Stunt | ఏదైనా సాధించాలన్న సంకల్పం ఉంటే చాలు.. వయసు అడ్డు రానే రాదు. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే. 60 ఏండ్ల వయసున్న ఓ వృద్ధుడు సైకిల్ స్టంట్లు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వృద్ధుడి సైకిల్ స్టంట్ల వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే.
వాహనాలతో రద్దీగా ఉన్న ఓ రహదారిపై వృద్ధుడు తన సైకిల్‌పై అతి వేగంగా దూసుకెళ్తున్నాడు. హ్యాండిల్‌ను వదిలేసి.. సైకిల్‌పై దూసుకెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హ్యాండిల్‌ను వదిలేయడమే కాదు.. కాళ్లను కూడా పెడల్ పైనుంచి తీసి దూసుకెళ్లాడు. తాత సైకిల్ స్టంట్లను ఓ యువకుడు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ వీడియోను 53 వేల మంది వీక్షించారు.
ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి.. రేపటి కోసం ఎదురు చూడొద్దు.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా సైకిల్ స్టంట్లు చేయడం వృద్ధుడి సంకల్పానికి నిదర్శనమని మరో యూజర్ రాసుకొచ్చాడు.
Enjoy every moment ❤️ pic.twitter.com/sOujOxmEfD
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 29, 2022