Sukesh Chandra | జైలులో నేతల బండారం బయట పెడుతా
మరోసారి సుఖేశ్ చంద్రశేఖర్ లేఖాస్త్రం
విధాత : మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ రాసిన లేఖ సంచలనం రేపుతుంది. లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు జైలులో సకల సదుపాయాలు పొందుతున్నారని లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార దుర్వినియోగంతో తీహార్ జైలులో నచ్చిన వారికి పోస్టింగ్ ఇచ్చారని, మాజీమంత్రి సత్యేంద్ర జైన్ తనకు సన్నిహితుడైన ధనుంజయ రావత్‌ను జైలు అధికారిగా నియమించుకున్నారని ఆరోపించారు. మూడు రోజుల నుంచి జైళ్ల శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ అధికారుల ద్వారా నన్ను బెదిరిస్తున్నారని, దీనిపై స్టేట్మెంట్ ఇవ్వొద్దు అంటూ ఒత్తిడి చేస్తున్నారని లేఖలో పేర్కోన్నారు. నన్ను ఎవరు బెదిరించినా నేను వెనక్కు తగ్గనని, మొత్తం నేతల బండారం బయటపెడతానని సుఖేశ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram