ఈఫిల్ టవర్ వద్ద దుండగుడి కాల్పులు.. ఒకరి మృతి
ప్రపంచ ప్రఖ్యాత ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద పర్యాటకులపై తుపాకీ దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరోఇద్దరు గాయపడ్డారు.

విధాత: ప్రపంచ ప్రఖ్యాత ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద పర్యాటకులపై తుపాకీ దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరోఇద్దరు గాయపడ్డారు. శనివారం రాత్రి ఈఫిల్ టవర్ వద్ద ఉన్న క్వియా డె గ్రెనెల్లే సమీపంలో ఓ వ్యక్తి తుపాకీతో ఒక వ్యక్తిపై కాల్పులు జరిపాడు. అక్కడ ఉన్న పోలీసులు అప్రమత్తమై అతడిని వెంబడించి పట్టుకున్నారు.
ఈ క్రమంలో అతడు సుత్తితో మరో ఇద్దరిని గాయపరిచాడు. నిందితుడి వద్ద నుంచి టేజర్ స్టన్ గన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతణ్ని26 ఏళ్ల ఫ్రెంచి జాతీయుడిగా గుర్తించారు. దాడి జరిగిన సమయంలో అతడు అల్లా హు అక్బర్ అని అరుస్తూ కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
అఫ్గానిస్థాన్, పాలస్తీనాలలో ముస్లింలు ఎక్కువ మంది చనిపోతున్నారని.. గాజాలో ఘోరాలు జరిగిపోతున్నాయని నిందితుడు ఆందోళనకు గురయినట్లు పోలీసులు తెలిపారు. 2016లో కూడా ఇదే తరహా దాడికి కుట్ర పన్నినందుకు అతడు జైలు శిక్ష కూడా అనుభవించాడు. మరో 8 నెలల్లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వనున్న ప్యారిస్ (Paris) లో ఇలాంటి దాడి చోటుచేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.