OTT | విధాత: ప్రతి వారం ఓటీటీలో ప్రేక్షకులకి మంచి వినోదం అందుతుంది. థియేటర్స్‌లో రిలీజైన సినిమాలు ఓటీటీలోకి వస్తుండగా, వాటితో పాటు కొన్ని ఓటీటీ సంస్థలు వైవిధ్యమైన కంటెంట్‌తో ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్‌లని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మరి ఈ వారం థియేటర్స్‌లో సందడి పెద్దగా లేని కారణంగా చాలా మంది ఓటీటీ కంటెంట్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో ద సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ (ఇంగ్లీష్ సినిమా) […]
OTT |
విధాత: ప్రతి వారం ఓటీటీలో ప్రేక్షకులకి మంచి వినోదం అందుతుంది. థియేటర్స్‌లో రిలీజైన సినిమాలు ఓటీటీలోకి వస్తుండగా, వాటితో పాటు కొన్ని ఓటీటీ సంస్థలు వైవిధ్యమైన కంటెంట్‌తో ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్‌లని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మరి ఈ వారం థియేటర్స్‌లో సందడి పెద్దగా లేని కారణంగా చాలా మంది ఓటీటీ కంటెంట్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు.
అయితే ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో ద సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. లవ్ ఎగైన్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా, జానే జాన్ (హిందీ చిత్రం) – సెప్టెంబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. కెంగన్ అసుర సీజన్ 2 (జపనీస్ సిరీస్) – సెప్టెంబరు 21వ తేదీ నుంచి, సిజర్ సెవన్ సీజన్ 4 (మాండరిన్ సిరీస్) – సెప్టెంబరు 21వ తేదీ నుంచి , సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌బ్రేక్ (స్పానిష్ సినిమా) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి , లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి, సాంగ్ ఆఫ్ బండిట్స్ (కొరియన్ సిరీస్) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి , స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఇక అమెజాన్ ప్రైమ్‌లో చూస్తే .. . కసండ్రో (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ద కాంటినెంటల్: ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్విక్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హాట్‌స్టార్‌లో అతిథి (తెలుగు సిరీస్) – సెప్టెంబరు 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా, దిస్ ఫుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ జరుగుతుంది. ఇక కింగ్ ఆఫ్ కొథా (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబర్ 22 వ తేదీ నుంచి, నో వన్ విల్ సేవ్ యూ (ఇంగ్లీష్ చిత్రం) – సెప్టెంబర్ 22 వ తేదీ నుంచి , ద కర్దాషియన్స్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో సినిమాలో ఫాస్ట్ X (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక బుక్ మై షోలో మెగ్ 2: ద ట్రెంచ్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ జరుపుకుంటుంది. ఇక ఆపిల్ ప్లస్ టీవీలో స్టిల్ అప్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కోత సినిమా కూడా ఈ వారం స్ట్రీమింగ్ కానుండగా, దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.. ఈ సినిమా థియేటర్స్ లో మంచి టాక్ ను సొంతం చేసుకుంది.