Padi Kaushik Reddy: ఈటల, రేవంత్ ఇద్దరు తోడు దొంగలే.. IT కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తా: ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి
Padi Kaushik Reddy ఈటలపై IT కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తా విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, హుజురాబాద్(Huzurabad) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇద్దరూ తోడుదొంగలేనని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) అన్నారు. శనివారం సాయంత్రం హుజురాబాద్ టిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీద ఆదాయ పన్ను శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో […]

Padi Kaushik Reddy
- ఈటలపై IT కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తా
విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, హుజురాబాద్(Huzurabad) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇద్దరూ తోడుదొంగలేనని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) అన్నారు. శనివారం సాయంత్రం హుజురాబాద్ టిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీద ఆదాయ పన్ను శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకుండా అడ్డుకునేందుకు వివేక్ వెంకటస్వామి ద్వారా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఈటల రూ.25 కోట్లు ఇచ్చినట్లు నియిజకవర్గంలోని ప్రజలు అభిప్రాయ పడుతున్నారన్నారు. ఆ విషయాన్నే ఈటల నోటి ద్వారా విన్నామన్నారు.
Sirisilla | రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు.. NMC గ్రీన్ సిగ్నల్
రెండేళ్ల క్రితమే తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకుండా రేవంత్ రెడ్డితో ఈటలతో కుమ్మక్కై కుట్ర పన్నారని ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేరన్నారు.
సమావేశంలో ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, ఎంపిపి ఇరుమళ్ల రాణి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగెమ్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
Karimnagar: CLPనేత పాదయాత్రలో అకాల వర్షం.. కూలిన టెంట్లు.. తడిసిన భట్టి
Karimnagar | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పిడుగుపాటుకు ఒకరి మృతి