Pakistan | మేము ఇప్పటికే చంద్రుడి మీద ఉన్నాం.. చంద్రయాన్-3 పై ఓ పాకిస్థానీ గడసరి సమాధానం
Pakistan | విధాత: చంద్రయాన్-3 (Chandrayan -3)ప్రయోగాన్ని విజయవంతం చేసిన భారత్‌పై ప్రపంచ దేశాల నుంచి అభినందనలు పోటెత్తుతున్న విషయం తెలిసిందే. మన దాయాది దేశంలో కూడా దీనిపై ఆసక్తి కనిపించింది. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగే ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని పాక్ (Pakistan) మాజీ మంత్రి ఫవాద్ చౌదరి.. ప్రయోగానికి కొన్ని గంటల ముందు ఆ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తిపై పాక్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. సోషల్‌మీడియాలోనూ […]
Pakistan |
విధాత: చంద్రయాన్-3 (Chandrayan -3)ప్రయోగాన్ని విజయవంతం చేసిన భారత్‌పై ప్రపంచ దేశాల నుంచి అభినందనలు పోటెత్తుతున్న విషయం తెలిసిందే. మన దాయాది దేశంలో కూడా దీనిపై ఆసక్తి కనిపించింది. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగే ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని పాక్ (Pakistan) మాజీ మంత్రి ఫవాద్ చౌదరి.. ప్రయోగానికి కొన్ని గంటల ముందు ఆ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అయితే ఈ విజ్ఞప్తిపై పాక్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. సోషల్‌మీడియాలోనూ ఈ విజ్ఞప్తిని సమర్థించేవారికి, వ్యతిరేకించేవారికి డిబేట్లు నడిచాయి. దీంతో ఒక యూట్యూబర్ ఈ ప్రయోగ ప్రసారంపై యువత ఆలోచనలకు కనుక్కుందామని వీధుల్లోకి వచ్చాడు.
Meanwhile, the Sense of Humor of Pakistani People are always top class. This on Chandrayaan pic.twitter.com/Y127YPeyIv
— Joy (@Joydas) August 23, 2023
అదే క్రమంలో ఒక యువకుడిని దీనిపై ప్రశ్నించాడు. దీనికి అతడు చెప్పిన సమాధానం అందరినీ భలే ఆకట్టుకుంది. ‘మనం ఆ ప్రయోగాన్ని చూడాల్సిన అవసరం ఏముంది? మనం ఇప్పటికే చందమామ మీద ఉన్నాం కదా?’ అని ప్రశ్నించాడు.
దీంతో ఆశ్చర్యపోయిన యాంకర్.. అదేమిటని అడగ్గా… ‘చంద్రుని మీదా కరెంట్ లేదు.. పాకిస్థాన్‌లోనూ లేదు. అక్కడా నీరు లేదు ఇక్కడా నీరు లేదు. అక్కడా గ్యాస్ లేదు.. ఇక్కడా లేదు .. మరి మనం చందమామ మీదే ఉన్నట్లు కదా’ అని ప్రశ్నించాడు.
దీంతో యాంకర్‌కు నోట మాట రాలేదు. ఈ వీడియో షూట్ చేస్తున్నపుడు అక్కడ నిజంగానే కరెంట్ లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా.. దీనిపై పలువురు యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ఇతడు స్టాండప్ కమెడియన్ రాణిస్తారని ఒకరు.. పాక్ పరిస్థితిని హృద్యంగా భలే చెప్పారని మరొకరు వ్యాఖ్యానించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram