Pawan Kalyan | తెలంగాణ ఎన్నికల బరిలో జనసేనాని.. 26 స్థానాల్లో పోటీకి అభ్యర్థులు సిద్ధం
Pawan Kalyan విధాత: ఆంధ్ర విషయంలో ఎలా ఉన్నా కానీ తెలంగాణ ఎన్నికల విషయంలో జనసేన మంచి జోరుగా ఉన్నట్లుంది. అక్కడ కేసీఆర్, కాంగ్రెస్, బిజెపిలకు ఎవరూ చేయని ధైర్యం జనసేనాని చేసారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందే అభ్యర్థులను ప్రకటించారు. రేపటి నుంచి ఆంధ్రాలో అన్నవరం నుంచి వారాహి బస్సు యాత్ర చేపట్టనున్న పవన్ కళ్యాణ్ తెలంగాణలోనూ యాత్ర చేస్తామన్నారు. ముందైతే ఆయన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తన బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు. ఇదే […]

Pawan Kalyan
విధాత: ఆంధ్ర విషయంలో ఎలా ఉన్నా కానీ తెలంగాణ ఎన్నికల విషయంలో జనసేన మంచి జోరుగా ఉన్నట్లుంది. అక్కడ కేసీఆర్, కాంగ్రెస్, బిజెపిలకు ఎవరూ చేయని ధైర్యం జనసేనాని చేసారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందే అభ్యర్థులను ప్రకటించారు. రేపటి నుంచి ఆంధ్రాలో అన్నవరం నుంచి వారాహి బస్సు యాత్ర చేపట్టనున్న పవన్ కళ్యాణ్ తెలంగాణలోనూ యాత్ర చేస్తామన్నారు.
ముందైతే ఆయన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తన బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు. ఇదే తరుణంలో అయన తెలంగాణ ఎన్నికల మీద కూడా దృష్టి సారించారు. ఎవరితో పొత్తు ఉందా లేదా అన్నది తేల్చకుండా సింగిల్ గా టికెట్స్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నేరవేర్చడమే జనసేన లక్ష్యం అని పవన్ పేర్కొన్నారు.
తెలంగాణలోనూ తనకు ఫాలోయింగ్ ఉందని భావిస్తున్న పవన్ అక్కడ 26 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అక్కడ ఈఏడాది చివర్లో.. అంటే డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. మరో వైపు అయన ఇక్కడ పూజలు, హోమాలు .. యాగాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
రేపు అన్నవరం దేవస్థానం నుంచి మొదలై.. భీమవరం వరకు తొలి విడత వారాహి యాత్ర సాగనుంది. యాత్రలో ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర సాగుతుంది.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నేరవేర్చడమే జనసేన లక్ష్యం
* జనసేన కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులతో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan సమావేశం
* 26 నియోజకవర్గాలకు బాధ్యుల నియామకం pic.twitter.com/NYgwDIvzSH
— JanaSena Party (@JanaSenaParty) June 12, 2023
1. వేమూరి శంకర్ గౌడ్ – కూకట్ పల్లి
2. లక్ష్మి శిరీష – ఎల్బీనగర్
3. వంగ లక్ష్మణ గౌడ్ – నాగర్ కర్నూలు
4. తేజవత్ సంపత్ నాయక్ – వైరా
5. మిరియాల రామకృష్ణ – ఖమ్మం
6. గోకుల రవీందర్ రెడ్డి – మునుగోడు
7. నందగిరి సతీష్ కుమార్ – కుత్బుల్లాపూర్
8. డాక్టర్ మాధవరెడ్డి – శేరిలింగం పల్లి
9. ఎడమ రాజేష్ – పటాన్ చెరువు
10. మండపాక కావ్య -సనత్ నగర్
11. వై.ఎమ్.ఎన్.ఎస్.ఎస్.వి నిహారిక నాయుడు – ఉప్పల్ శివ కార్తీక్ కో కన్వీనర్ – ఉప్పల్
12. వేముల కార్తీక్ – కొత్తగూడెం
13. డేగల రామచంద్ర రావు – అశ్వరావుపేట
14. వి.నగేష్ -పాలకుర్తి
15. మేరుగు శివకోటి యాదవ్ -నర్సంపేట
16. గాదె పృథ్వీ – స్టేషన్ ఘన్ పూర్
17. తగరపు శ్రీనివాస్ – హుస్నాబాద్
18. మూల హరీష్ గౌడ్ – రామగుండం
19. టెక్కల జనార్ధన్ – జగిత్యాల
20. చెరుకుపల్లి రామలింగయ్య -నకిరేకల్
21. యన్ నాగేశ్వరరావు – హుజూర్ నగర్
22. మాయ రమేష్ – మంథని
23. మేకల సతీష్ రెడ్డి – కోదాడ
24. బండి నరేష్ – సత్తుపల్లి
25. వంశీకృష్ణ – వరంగల్ వెస్ట్
26. బాలు గౌడ్ – వరంగల్ ఈస్ట్