Pawan Kalyan | పవన్‌కు NDA పిలుపు.. మ‌రి బాబు ప‌రిస్థితి ఏంటి..

Pawan Kalyan విధాత‌: జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వ‌చ్చింది. ఈ నెల 18న జరిగే NDA భాగస్వామి పక్షాల సమావేశానికి ఢిల్లీ రావాల‌ని ఆహ్వానం అందింది. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ NDA కూటములోనే ఉన్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. ఇదిలా ఉండ‌గా BJPతో క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ఆరాటప‌డ్డ‌ చంద్ర‌బాబుకు మాత్రం పిలుపు రాలేదు. గ‌తంలో BJP, జ‌న‌సేన పార్టీల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని బాబు యోచిస్తూ BJP […]

  • By: krs    latest    Jul 16, 2023 9:36 AM IST
Pawan Kalyan | పవన్‌కు NDA పిలుపు.. మ‌రి బాబు ప‌రిస్థితి ఏంటి..

Pawan Kalyan

విధాత‌: జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వ‌చ్చింది. ఈ నెల 18న జరిగే NDA భాగస్వామి పక్షాల సమావేశానికి ఢిల్లీ రావాల‌ని ఆహ్వానం అందింది. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ NDA కూటములోనే ఉన్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. ఇదిలా ఉండ‌గా BJPతో క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ఆరాటప‌డ్డ‌ చంద్ర‌బాబుకు మాత్రం పిలుపు రాలేదు. గ‌తంలో BJP, జ‌న‌సేన పార్టీల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని బాబు యోచిస్తూ BJP పెద్దలతో మంతనాలు చేసిన‌ప్ప‌టికి కుద‌ర‌లేదు.

ఇక జ‌న‌సేనాని ఈ సభకు హాజ‌ర‌వుతారా లేదా అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు. రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారం చేజిక్కించుకోవాల‌నిస‌ర్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్న BJP కి మొన్న జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది . ఈ ఏడాది జరిగే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోను ఎదురు గాలి వీచే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉండ‌టంతో BJP పెద్ద‌ల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థంకాక వ్యూహాలు ర‌చిస్తోంది BJP. ఈ క్ర‌మంలోనే NDA భాగస్వామ్య‌ పక్షాలతో స‌మావేశాలు నిర్వ‌హిస్తోంది.