Pawan Kalyan | అంబటి రాంబాబుని శ్యామ్ బాబుని చేసిన పవన్ కళ్యాణ్.. ఓ ఆట ఆడేసుకున్నాడుగా..!
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇటీవల సినిమాల కన్నా కూడా రాజకీయాలపైన ఎక్కువ దృష్టి పెట్టారు. వైసీపీ నాయకుల అరాచకాలని బయటపెడుతూ వారిని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి జగన్ నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ప్రతి ఒక్కరిపై విమర్శనాస్త్రాలు వదులుతున్నారు. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై ఏ రేంజ్‌లో విరుచుకు పడ్డారో మనం చూశాం. అయితే ఇప్పుడు సినిమాలలో కూడా ఆయన వారిని టార్గెట్ చేస్తూ సెటైర్స్ వేస్తున్నారు. తాజాగా విడుదలైన […]

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇటీవల సినిమాల కన్నా కూడా రాజకీయాలపైన ఎక్కువ దృష్టి పెట్టారు. వైసీపీ నాయకుల అరాచకాలని బయటపెడుతూ వారిని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి జగన్ నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ప్రతి ఒక్కరిపై విమర్శనాస్త్రాలు వదులుతున్నారు.
వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై ఏ రేంజ్‌లో విరుచుకు పడ్డారో మనం చూశాం. అయితే ఇప్పుడు సినిమాలలో కూడా ఆయన వారిని టార్గెట్ చేస్తూ సెటైర్స్ వేస్తున్నారు. తాజాగా విడుదలైన బ్రో సినిమాలో ఏపీ మంత్రిని టార్గెట్ చేసి సెటైర్స్ పేల్చినట్టు అభిమానులు భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాల్లో వైసీపీ నేతలపై ఎంతగా చెలరేగిపోయాడో మనం చూశాం. అందులో ‘శుక్రవారం వచ్చి సంతకం పెట్టి వెళ్ళు’ వంటి డైలాగ్స్ ఏపీ సీఎం జగన్ తో పాటు ఆ పార్టీ నేతలకు బాగా గుచ్చుకున్నాయి.
ఇక బ్రో సినిమాలో అంబటి రాంబాబును తలపించేలా 30 ఇయర్స్ పృథ్వీని సిద్ధం చేశారు. పృథ్వీ డాన్స్ చేస్తున్నప్పుడు ఆయనపై పవన్ కళ్యాణ్ సెటైర్స్ వేశారు. పృథ్వీకి శ్యామ్ బాబు అనే పేరు పెట్టడంతో పాటు అంబటి వేసుకున్న టీ షర్ట్ మాదిరిగా టీ షర్ట్ వేయించారు. ఇక పృథ్వీ డ్యాన్స్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫైర్ అవుతుండడం ఫుల్ ఫన్నీగా అనిపించింది.
ప్రెస్ మీట్స్, సభలలోనే కాదు తన సినిమాలలోను పవన్ వైసీపీ నాయకులని భలే ఆడేసుకుంటున్నాడుగా అని జనాలు ముచ్చటించుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అంబటికి సంబంధించి థియేటర్స్ లో రికార్డు చేసిన వీడియోని మాత్రం తెగ వైరల్ చేస్తున్నారు.
మరి దీనిపై అంబటి రాంబాబు ఏమైన స్పందిస్తాడా లేదా అన్నది చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ తన సినిమాలో అంబటిని టార్గెట్ చేయడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ఆయన పదే పదే ప్రెస్ మీట్స్ పెట్టి పవన్ కళ్యాణ్‌ని విమర్శించడం వల్లనే తన సినిమా ద్వారా ఆయనకి గట్టిగా ఇచ్చి పడేసినట్టు తెలుస్తుంది.
repeat veyyalsinde..silent ga chaalane punch lu vesadu syambabu anta