Pawan Kalyan | బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మా వదిన ద్రోహం చేసిందంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan | మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన బ్రో రిలీజ్ ఈవెంట్‌లో తన వదిన చాలా ద్రోహం చేసిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.గతంలో తన వదిన వల్లనే ఈ స్థాయిలో ఉండగలిగానని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఆమె ద్రోహం చేసిందని అనడంపై అందరిలో అయోమయం నెలకొంది. అయితే ఈ విషయాన్ని ఫన్నీగా చెప్పడం గమనర్హం. వివరాలలోకి వెళితే బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన పవన్ కళ్యాణ్ […]
Pawan Kalyan |
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన బ్రో రిలీజ్ ఈవెంట్‌లో తన వదిన చాలా ద్రోహం చేసిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.గతంలో తన వదిన వల్లనే ఈ స్థాయిలో ఉండగలిగానని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఆమె ద్రోహం చేసిందని అనడంపై అందరిలో అయోమయం నెలకొంది.
అయితే ఈ విషయాన్ని ఫన్నీగా చెప్పడం గమనర్హం. వివరాలలోకి వెళితే బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన పవన్ కళ్యాణ్ సుధీర్ఘమైన స్పీచ్ ఇచ్చారు. తనకి సినిమాలలో వచ్చే ఆసక్తి లేదని, ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ, పొలం పనులు చేసుకోవాలని తాను అనుకున్నట్టు పవన్ అన్నారు. అన్నయ్య నన్ను హీరో అవుతావా అన్నప్పుడు చాలా భయమేసింది.
మా వదిన నన్ను చాలా నమ్మి సినిమాలు చేయమని ప్రోత్సహించారు. అయితే చిత్ర షూటింగ్ లో భాగంగా ఓ సారి జగదాంబ థియేటర్ వద్ద బస్ ఎక్కి నన్ను డాన్స్ చేయమన్నారు. అప్పుడు అందరి ముందు డాన్సు చేయడానికి నేను సిగ్గుతో చచ్చిపోయాను. అదే రోజు ఫోన్ చేసి మా వదినని ఇలా ఎందుకు చేసారని నిలదీశాను.

ఆ రోజు మా వదిన చేసిన ఈ తప్పు కారణంగానే ఇప్పుడు నేను ఇలా మీ ముందు నిల్చున్నాను. ఇలా జరగడానికి కారణం వదిన చేసిన ద్రోహమే అంటూ పవన్ కళ్యాణ్ ఫన్నీ వేలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మీరు నాపై ఇంతటి, ప్రేమ అభిమానం చూస్తేంటే ఇది కలా, నిజమా అని ఒక్కోసారి అనిపిస్తుందన్నారు.
ఏదో చిన్న జీవితాన్ని నేను గడపాలని బావించాను, కానీ కోట్లాది మంది అభిమానులు నాకు దక్కడం అదృష్టమన్నారు పవన్. మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్ అని మాటల్లో కూడా చెప్పలేనని తెలిపారు. నేను చేసే సినిమాల్లో సమాజానికి ఏదో మంచి ఇచ్చేదిగా, సందేశం ఇచ్చేదిగా ఉండాలని భావిస్తుంటాను.
బ్రో సినిమా మాత్రం పూర్తిగా ప్రేక్షకులని అలరించే విధంగా ఉంటుందని పవన్ అన్నారు. 70 రోజుల్లో చేయాల్సిన షూటింగ్‌ని సముద్రఖని ప్లానింగ్ వలన కేవలం 21 రోజుల్లోనే పూర్తి చేశామని స్పష్టం చేశారు. ఇక ఈ చిత్రం కోసం దర్శకుడు సముద్రఖని చాలా కష్టపడ్డారని కూడా పవన్ పేర్కొన్నాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram