అటు పవన్ – ఇటు లోకేష్.. అక్టోబర్ 1 నుంచి యాత్రలు షురూ !

చంద్రబాబు జైల్లో ఉన్నా పార్టీని, క్యాడర్ ను ఏమాత్రం రిలాక్స్ అవ్వనివ్వరాదని భావిస్తున్న చంద్రబాబు మళ్ళీ యాత్రలకు రూట్ మ్యాప్ ఇచ్చారు. బాబు అరెస్ట్ అయ్యాక టిడిపి శ్రేణుల్లో స్తబ్ధత నెలకొంది. షాక్ లో ఉన్న క్యాడర్ ఇప్పుడిప్పుడే. కోలుకుంటోంది. అక్కడక్కడా ధర్నాలు..ర్యాలీలు చేస్తున్నారు. ఇక లోకేష్ సైతం తన యువ గళం పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇక అక్టోబర్ ఒకటో తేదీన మళ్ళీ ఆయన యాత్ర ప్రారంభిస్తున్నారు. ఇక టిడిపి రాజకీయ భాగస్వామి పవన్ సైతం కృష్ణా జిల్లాలో వారాహి యాత్రకు రెడీ అవుతున్నారు.

బాబు అరెస్ట్ అయిన 9 వ తేదీన లోకేష్ కోనసీమ జిల్లాలోని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలోని పొదలాడ వద్ద లోకేష్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. దాంతో మళ్లీ అక్కడ నుంచే ఆయన యాత్ర కొనసాగిస్తారు. ఇక విశాఖలో మూడవ విడత వారాహి యాత్రను చేసిన పవన్ కళ్యాణ్ నాలుగవ విడత యాత్రను క్రిష్ణా జిల్లాలో అక్టోబర్ 1 నుంచి ప్రారంభించనున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల నుంచి పవన్ వారాహి యాత్ర సాగనుందని అంటున్నారు. అవనిగడ్డలో బహిరంగ సభ. మచిలీపట్నం, పెడన, కైకలూరు మీదుగా యాత్ర కొనసాగనుంది.