అచ్చోచ్చిన విశాఖ.. మూడున పవన్ మార్చ్: ప్రభుత్వం ఉలికిపాటు

విధాత: ఆచ్చోచ్చిన పిచ్ మీద ఎప్పుడు బ్యాటింగ్ చేద్దామా.. దుమ్ము లేపుదామా అని క్రికెటర్ ఎదురు చూస్తుంటాడు.. ఆచ్చోచ్చిన డైరెక్టర్‌తో మళ్ళీ ఎప్పుడు సినిమా తీద్దామా అని హీరో వెయిట్ చేస్తుంటాడు.. ఆచ్చోచ్చిన వ్యాపారం కొత్త బ్రాంచ్ ఎప్పుడు పెడదామా అని. యాపారి ఆలోచన.. ఇప్పుడు పవన్ కూడా ఆచ్చోచ్చిన విశాఖలో మళ్ళీ హాల్ చల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ మధ్య విశాఖ గర్జన రోజు ఇక్కడికి వచ్చిన పవన్‌ను పోలీసులు అడ్డగించండం.. ఆ తరువాత […]

  • By: krs    latest    Oct 30, 2022 2:12 PM IST
అచ్చోచ్చిన విశాఖ.. మూడున పవన్ మార్చ్:  ప్రభుత్వం ఉలికిపాటు

విధాత: ఆచ్చోచ్చిన పిచ్ మీద ఎప్పుడు బ్యాటింగ్ చేద్దామా.. దుమ్ము లేపుదామా అని క్రికెటర్ ఎదురు చూస్తుంటాడు.. ఆచ్చోచ్చిన డైరెక్టర్‌తో మళ్ళీ ఎప్పుడు సినిమా తీద్దామా అని హీరో వెయిట్ చేస్తుంటాడు.. ఆచ్చోచ్చిన వ్యాపారం కొత్త బ్రాంచ్ ఎప్పుడు పెడదామా అని. యాపారి ఆలోచన.. ఇప్పుడు పవన్ కూడా ఆచ్చోచ్చిన విశాఖలో మళ్ళీ హాల్ చల్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఆ మధ్య విశాఖ గర్జన రోజు ఇక్కడికి వచ్చిన పవన్‌ను పోలీసులు అడ్డగించండం.. ఆ తరువాత ఎయిర్‌ పోర్టులో మంత్రుల కార్ల మీద జన సైనికుల దాడులు.. అరెష్టులు.. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ అభిమానుల ఆందోళన.. నిర్బంధం నడుమ పవన్ బెజవాడ పయనం.. చంద్రబాబు పరామర్శ.. ఇవన్నీ తెలిసినవే..

ఈ నేపథ్యంలో నవంబర్ మూడున పవన్ సేవ్ విశాఖ అంటూ భారీగా పాదయాత్ర.. మార్చ్‌ను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉలిక్కి పడుతోంది. విశాఖలోని బీచ్ రోడ్లో ఈ మార్చ్ సాగనుంది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అని చెబుతోంది.. అమరావతిని రాజధానిగా ఉంచి.. విశాఖను అభివృద్ధి చేయాలని టీడీపీ చెబుతోంది.

అయితే ప్రత్యక్షంగా పవన్ కూడా అమరావతికే మద్దతిస్తున్నారు. అయితే విశాఖను అభివృద్ధి చేయొద్దని మాత్రం అనడం లేదు. ఇక ఈ క్రమంలోనే ఇటీవల మంత్రులు విశాఖ గర్జన పేరుతో కార్యక్రమానికి పిలుపు నిస్తే.. వెంటనే జనసేన అక్కడ జనవాణి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అయితే ఇది వివాదానికి దారి తీయడం .. ఆ లొల్లి అక్కడితో ముగియడం తెలిసిందే..

అయితే తాజాగా నవంబర్‌ 3న పవన్ విశాఖలో మార్చ్ నిర్వహించనున్నాడనే వార్త ఆసక్తి రేపుతోంది. బీచ్ రోడ్లో సుమారు 5 కిలోమీటర్ల మేరకు సాగే ఈ పాదయాత్రలో యువత విద్యార్థులను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖను కబ్జాదారుల చేతి నుంచి కాపాడే లక్ష్యంతో అంటూ ఈ మార్చ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మరి దానికి పోటీగా మంత్రులు కూడా పాదయాత్ర చేస్తారని అంటున్నారు.. ఏమవుతుందో చూడాలి..