కొండగట్టు అంజన్న బాకీ చెల్లించ‌వా పవన్ కళ్యాణ్‌ !!

విధాత‌: వారాహి అంటూ భారీ ప్రచార వాహనాన్ని తయారు చేయించిన పవన్ కళ్యాణ్ అత్యంత నమ్మకంతో దానికి అంజ‌నేయస్వామి చెంత పూజలు చేయించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్‌లోని ప్రఖ్యాత హనుమాన్ దేవాలయంలో పూజ చేస్తే అంతా జయమే అనే విశ్వాసంతో వచ్చిన పవన్ పూజ అనంతరం అంతే ఘనంగా తిరుగు పయణమయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆయన గతంలో ఇచ్చిన హామీని అమలు చేస్తారని అందరూ భావించినా పవన్ మాత్రం ఉత్త చేతుల్తోనే […]

కొండగట్టు అంజన్న బాకీ చెల్లించ‌వా పవన్ కళ్యాణ్‌ !!

విధాత‌: వారాహి అంటూ భారీ ప్రచార వాహనాన్ని తయారు చేయించిన పవన్ కళ్యాణ్ అత్యంత నమ్మకంతో దానికి అంజ‌నేయస్వామి చెంత పూజలు చేయించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్‌లోని ప్రఖ్యాత హనుమాన్ దేవాలయంలో పూజ చేస్తే అంతా జయమే అనే విశ్వాసంతో వచ్చిన పవన్ పూజ అనంతరం అంతే ఘనంగా తిరుగు పయణమయ్యారు.

అయితే ఈ సందర్భంగా ఆయన గతంలో ఇచ్చిన హామీని అమలు చేస్తారని అందరూ భావించినా పవన్ మాత్రం ఉత్త చేతుల్తోనే తిరిగి వెళ్లారు. వాస్తవానికి 2009లో ప్రజారాజ్యం సమయంలో కరీంనగర్ జిల్లాలో ఓ ప్రచార సభలో పాల్గొన్న పవన్ విద్యుదాఘాతానికి గురై తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

అయితే హనుమాన్ ఆశీర్వాదం వల్లనే తను బతికి బట్టగట్టినట్లు విశ్వసించిన పవన్ తొమ్మిదేళ్ల అనంతరం.. అంటే 2018 జనవరిలో మళ్ళీ కొండగట్టు వెళ్లి స్వామి వారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు.

ఈ సందర్భంగా రూ.11 లక్షలు ఆలయానికి విరాళం ప్రకటించారు. అయితే ఈ డబ్బు ఇంకా హనుమాన్ ఆలయానికి చేరలేదని, ఉత్త హామీగానే మిగిలింది అని ఆలయవర్గాలు అంటున్నాయి. ఏమయ్యా పవనూ. హనుమాన్ పేరు.. అంటే పవన్అని పేరు పెట్టుకున్న ఈ పవన్ కళ్యాణ్ సాక్షాత్తూ భగవంతుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే ఎలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.