Hanumakonda: PDSU మార్నింగ్ వాక్.. జార్జ్, అంబేద్కర్‌లకు ఘన నివాళులు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సందర్భంగా పిడిఎస్‌యూ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ లోని పబ్లిక్ గార్డెన్ నుండి మార్నింగ్ వాక్ కార్యక్రమం కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్ వరకు కొనసాగింది. ఈ మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని పబ్లిక్ గార్డెన్ లో కె.యు. ప్రొఫెసర్ లు వి.రామచంద్రం, ఈసం నారాయణలు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేయూ గ్రౌండ్ లో పి.డి.ఎస్.యు. రాష్ట్ర నాయకులు మొగిలి వెంకటరెడ్డి, బి. నరసింహారావు, భాష […]

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సందర్భంగా పిడిఎస్‌యూ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ లోని పబ్లిక్ గార్డెన్ నుండి మార్నింగ్ వాక్ కార్యక్రమం కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్ వరకు కొనసాగింది. ఈ మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని పబ్లిక్ గార్డెన్ లో కె.యు. ప్రొఫెసర్ లు వి.రామచంద్రం, ఈసం నారాయణలు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేయూ గ్రౌండ్ లో పి.డి.ఎస్.యు. రాష్ట్ర నాయకులు మొగిలి వెంకటరెడ్డి, బి. నరసింహారావు, భాష బోయిన వేణు రాజ్ ల అధ్యక్షతన సభ నిర్వహించి, జార్జిరెడ్డి చిత్రపటానికి పూలతో ఘనంగా నివాళులు అర్పించారు.
స్ఫూర్తి ప్రదాతలు అంబేద్కర్, జార్జిరెడ్డి
దేశంలో.. రాష్ట్రంలో కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమాలకు, సమాజ ఉద్యమాలకు, ప్రగతిశీల భావజాల వ్యాప్తికి జార్జి రెడ్డి నిత్య స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నాడని, దేశంలో కులం, మతం లేని సమాజ నిర్మాణానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం అర్పించారన్నారు, అంబేద్కర్, జార్జిరెడ్డిలు ప్రాణాలు లెక్కచేయకుండా జీవితాంతం కృషి చేసిన యోధులని కేయూ ప్రొఫెసర్లు రామచంద్రం, వై వెంకయ్య, ఈసం నారాయణ లు మాట్లాడుతూ ఇరువురి మార్గాలు వేరే అయినప్పటికీ లక్ష్యం మాత్రం దేశంలో తరతరాలుగా వేళ్లూను కొని వున్న బ్రాహ్మణీయ భావాజాలాన్ని, అణిచివేత, అంటరానితనం, వివక్షతలను తుదముట్టించడమేనని వారు తెలిపారు.
దేశంలో రాష్ట్రంలో అధికార పీఠమే ధ్యేయంగా పాలకులు అనుసరిస్తున్న విధానాల వలన పౌరుల ప్రజాస్వామిక హక్కులకు, ప్రశ్నించే గొంతులకు రక్షణ లేకుండా పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో విద్యా కాషాయీకరణ భావిభారత పౌరులను కుల,మత ఉన్మాదులుగా మార్చే ప్రమాదం ఉన్నదని, ఇది సమాజ అభివృద్ధికి దేశ ప్రజల ఐక్యతకు ప్రమాదకరమని అన్నారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, నేటి తరం విద్యార్థులు జార్జిరెడ్డి స్ఫూర్తితో శాస్త్రీయ విద్యా సాధన కోసం, ప్రగతిశీల భావజాల వ్యాప్తికై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. పూర్వ రాష్ట్ర కార్యదర్శులు బండి కోటేశ్వరరావు, తీగల జీవన్ , టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్, పి.డి.ఎస్.యు.పూర్వ రాష్ట్ర నాయకులు నలిగంటి చంద్రమౌళి, రమేష్ ,నున్నా అప్పారావు, రాచర్ల బాలరాజు, ఎలకంటి రాజేందర్,డాక్టర్ సాదు రాజేష్, డాక్టర్. ఎన్. వెంకటరమణ, పాలకుర్తి శ్రీనివాస్ ,ముల్క రవి, విష్ణు, కందికొండ రంజిత్, మైదం పాణి, సాబిరికాని మోహన్, పీహెచ్డీ స్కాలర్ మాదాసీ రమేష్, ప్రస్తుత పి.డి.ఎస్.యు. ఉమ్మడి వరంగల్ జిల్లా మరియు కాకతీయ యూనివర్సిటీ నాయకులు కామగోని శ్రవణ్, రంజిత్, శివ, ప్రవీణ్ అరుణ్ ,శశి, పృద్వి , రాకేష్, సందీప్, నవీన్, అరుణ్, వరుణ్, మెషారాఫ్, శ్రీకాంత్, వెంకటేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
మానుకోటలో మహనీయులకు నివాళులు
మహబూబాబాద్ జిల్లా TPTF ఆధ్వర్యంలో మహనీయుల స్మృతిలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. NTR స్టేడియంలో విప్లవ ధ్రువతార జార్జ్ రెడ్డి చిత్రపటానికి.. TPTF, CPIML NEW DEMOCRACY, BSP నాయకులు మైస శ్రీనివాసులు, మండల వెంకన్న, దార్ల శివరాజ్, కాళోజి వాకర్స్ బాధ్యులు వెంకట్ రెడ్డి, చుంచు శ్రీశైలం పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం బాబు జగజీవన్ రాం విగ్రహానికి TPTF మహిళా నాయ కురాళ్లు అనిత, హరీణి, మంజు భార్గవి సువర్ణ , DR.ప్రత్యూష పూలమాల వేశారు. మహాత్మా జ్యోతి భాపూలే విగ్రహానికి TPTF మండలాల బాధ్యులు, PDSU, PYL బాధ్యులు పూలమాల వేశారు.
తదుపరి అంబేద్కర్ చౌరస్తాకు వెళ్లి DR. అంబేద్కర్ విగ్రహానికి TPTF రాష్ట్ర పూర్వప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు చుంచు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి P. విష్ణువర్ధన్ రెడ్డి, రాజకీయ పార్టీల నాయకులు మండల వెంకన్న, దార్ల శివరాజ్, దేశెట్టి రాంచంద్రయ్య, గుజ్జు దేవేందర్లు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మహనీయుల నినాదాలతో, పాటలతో మార్నింగ్ వాకింగ్ నిర్వహించారు.