People’s March | వంద రోజులు పూర్తి చేసుకున్న భట్టి పాదయాత్ర
People's March ఉప్పలపాడులో కేక్ కట్ చేసిన మంత్రి దామోదర్ రెడ్డి భట్టిని అభినందించిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ విధాత: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కేక్ కట్ చేసి పాదయాత్ర […]

People’s March
- ఉప్పలపాడులో కేక్ కట్ చేసిన మంత్రి దామోదర్ రెడ్డి
- భట్టిని అభినందించిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్
విధాత: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కేక్ కట్ చేసి పాదయాత్ర రథసారథి భట్టి విక్రమార్కకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
అదే విధంగా మాజీ మంత్రి సంభానీ చంద్రశేఖర్ ఖమ్మం నుంచి పార్టీ అనుచర గణంతో ఉప్పలపాడు గ్రామానికి చేరుకొని భట్టి విక్రమార్క ను పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. వంద రోజులు పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య ఈ సందర్భంగా భట్టి విక్రమార్కను కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, సూర్యాపేట డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న, హనుమకొండ డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గం కోఆర్డినేటర్ నెమిండ్ల శ్రీనివాస్, ఓయూ జేఏసీ నేతలు లోకేష్ యాదవ్, విజయ్ కుమార్, పీసీసీ సభ్యులు ఏసుపాదం, దైద రవీందర్ గాలి బాలాజీ ఫక్రుద్దీన్ వేదాసు శ్రీధర్
కేతేపల్లి పార్టీ మండల అధ్యక్షులు శ్రీను, ఎంపీపీ శేఖర్, పిఎసిఎస్ చైర్మన్ బోల్ల వెంకట్ రెడ్డి, సర్పంచి దుర్గం శశికళ పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చు పాదయాత్ర 100వ రోజు శుక్రవారం నాడు కేతపల్లి మండల కేంద్రం నుంచి చీకటి గూడెం ఉప్పలపాడు భాగ్యనగరం కొప్పోలు గ్రామం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారం మార్గాలను తెలియజేస్తూ నైరాశ్యంలో ఉన్న ప్రజలకు భరోసా ఇస్తూ భట్టి విక్రమార్క తన పాదయాత్రను ముందుకు కొనసాగించారు.