‘బండి’ ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి నిరాకరణ
విధాత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న 5వ విడత ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు బైంసా నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా యాత్రకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అనుమతి కోరిన సంగతి తెలిసిందే. బైంసాలో శాంతిభద్రతల కారణంగా పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి నిరాకరించినట్లు నిర్మల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ధృవీకరించారు. మరోవైపు రేపు బండి సంజయ్ యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ..నిర్మల్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన […]

విధాత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న 5వ విడత ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు బైంసా నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా యాత్రకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అనుమతి కోరిన సంగతి తెలిసిందే.
బైంసాలో శాంతిభద్రతల కారణంగా పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి నిరాకరించినట్లు నిర్మల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ధృవీకరించారు. మరోవైపు రేపు బండి సంజయ్ యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ..నిర్మల్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన చేపట్టింది. ఆందోళ చేస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేశారు.
Is meeting people crime in #Telangana?
What is KCR regime scared of?
Why are we being stopped at every place?
Why is the permission denied for #PrajaSangramaYatra5 ?
Is this democracy? pic.twitter.com/nW8iL1AlAV
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 27, 2022