Road Accident | నిర్మ‌ల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు మృతి

Road Accident | నిర్మ‌ల్ జిల్లా భైంసాలోని స‌త్‌పూల్ బ్రిడ్జి వ‌ద్ద మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే న‌లుగురు ప్రాణాలు కోల్పోగా, మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

  • By: raj |    telangana |    Published on : Jan 20, 2026 7:16 AM IST
Road Accident | నిర్మ‌ల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు మృతి

Road Accident | నిర్మ‌ల్ జిల్లా భైంసాలోని స‌త్‌పూల్ బ్రిడ్జి వ‌ద్ద మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే న‌లుగురు ప్రాణాలు కోల్పోగా, మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బంధువుల‌ను ప‌రామ‌ర్శించేందుకు హైద‌రాబాద్‌కు కారులో వెళ్లి వ‌స్తుండ‌గా.. ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. కారును కంటైన‌ర్ ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుల‌ను కుబేర్ మండ‌లం కుప్టి గ్రామానికి చెందిన ప‌టేల్(42), రాజ‌న్న‌(60), బాబ‌న్న‌(70), కారు డ్రైవ‌ర్‌గా గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.