Nalgonda: విద్యుత్ షాక్‌తో పెట్రోల్ బంక్ మేనేజర్ మృతి

విధాత: నల్గొండ పట్టణంలోని వీటి కాలనీ హెచ్ పి పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్న మేనేజర్ నల్లగంతుల శ్రీకాంత్ విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం ట్యాంకర్‌లో పెట్రోల్ నిల్వ చూసేందుకు ఇనుప చువ్వతో ప్రయత్నిస్తున్న క్రమంలో వెనక ఉన్న ట్రాన్స్ ఫార్మర్‌కి తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. బంక్ సిబ్బంది అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ […]

Nalgonda: విద్యుత్ షాక్‌తో పెట్రోల్ బంక్ మేనేజర్ మృతి

విధాత: నల్గొండ పట్టణంలోని వీటి కాలనీ హెచ్ పి పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్న మేనేజర్ నల్లగంతుల శ్రీకాంత్ విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం ట్యాంకర్‌లో పెట్రోల్ నిల్వ చూసేందుకు ఇనుప చువ్వతో ప్రయత్నిస్తున్న క్రమంలో వెనక ఉన్న ట్రాన్స్ ఫార్మర్‌కి తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.

బంక్ సిబ్బంది అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.