ఈడీ విచారణకు పైలెట్ దూరం..!
విధాత, హైదరాబాద్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి దూరమయ్యారు. విచారణకు హాజరుకావడం లేదని ఈడీ అధికారులకు రోహిత్‌రెడ్డి మేయిల్ చేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ తనను విచారించడంపై ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో విచారణకు హాజరుకావడం లేదని తెలిపినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో సోమవారం పిటిషన్ […]

విధాత, హైదరాబాద్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి దూరమయ్యారు. విచారణకు హాజరుకావడం లేదని ఈడీ అధికారులకు రోహిత్‌రెడ్డి మేయిల్ చేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ తనను విచారించడంపై ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో విచారణకు హాజరుకావడం లేదని తెలిపినట్లు తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ కోర్టు విచారణ చేపట్టనున్నది. ఫిర్యాదుదారుడినే ఈడీ ప్రశ్నించడమేంటని ఆదివారం మీడియా సమావేశంలో మండిపడ్డారు. తనను కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఈడీ పరిధిలోకి రాకపోయినా నన్ను విచారణకు పిలిచారని, న్యాయవ్యవస్థలో ఉన్న సాంకేతిక అంశాలు అడ్డుపెట్టుకుని.. బీజేపీ నేతలు విచారణకు రావడం లేదని ఆరోపించారు. ఈడీ, సీబీఐ ఏది వచ్చినా మేము సిద్ధమని, ఈడీ విచారణపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీర్పులో కీలక అంశాలు
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని హైకోర్టు సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, హైకోర్టు తీర్పులో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికే తప్పేనన్న కోర్టు.. ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని పేర్కొంది. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది.
దర్యాప్తు అధికారుల వద్ద ఉండాల్సిన ఆధారాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయని, దర్యాప్తు సమాచారం మీడియాతో సహా ఎవరికీ చెప్పకూడదని పేర్కొంది. దర్యాప్తు ప్రారంభదశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయన్న కోర్టు.. సిట్ చేసిన దర్యాప్తు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్‌లా అనిపించలేదని అభిప్రాయపడింది. దర్యాప్తు ఆధారాలు బహిర్గతం కావడం వల్ల విచారణ సక్రమంగా జరుగదని, ఆర్టికల్ 20, 21 ప్రకారం దర్యాప్తు సైతం సరైన రీతిలో జరగాలని నిందితులు కోవచ్చని పేర్కొంది.