National Commission for Men | మహిళా కమిషన్ మాదిరే.. పురుష కమిషన్ వేయండి.. సుప్రీంలో ఓ బాధితుడి ఫిర్యాదు

విధాత: National Commission for Men| ఇన్నాళ్లూ చట్టం నుంచి, వేధింపుల (Harassment) నుంచి మహిళలకే రక్షణ దక్కుతూ వస్తోంది. వారి కోసం మహిళా కమిషన్లు (National commission for women) ప్రత్యేక కోర్టులు చట్టాలు కూడా చేసారు. మరి మహిళల చేతిలో హింసకు , వేధింపులకు గురవుతున్న పురుషుల సంగతి ఏమిటి.. వారికి రక్షణ అక్కర్లేదా.. వారివి జీవితాలు కాదా.? ఈ ప్రశ్న కొన్నాళ్లుగా జనంలో నానుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఓ వ్యక్తి ఏకంగా […]

  • By: Somu    latest    Mar 17, 2023 12:52 PM IST
National Commission for Men | మహిళా కమిషన్ మాదిరే.. పురుష కమిషన్ వేయండి.. సుప్రీంలో ఓ బాధితుడి ఫిర్యాదు

విధాత: National Commission for Men| ఇన్నాళ్లూ చట్టం నుంచి, వేధింపుల (Harassment) నుంచి మహిళలకే రక్షణ దక్కుతూ వస్తోంది. వారి కోసం మహిళా కమిషన్లు (National commission for women) ప్రత్యేక కోర్టులు చట్టాలు కూడా చేసారు. మరి మహిళల చేతిలో హింసకు , వేధింపులకు గురవుతున్న పురుషుల సంగతి ఏమిటి.. వారికి రక్షణ అక్కర్లేదా.. వారివి జీవితాలు కాదా.? ఈ ప్రశ్న కొన్నాళ్లుగా జనంలో నానుతూనే ఉంది.

అయితే ఇప్పుడు ఓ వ్యక్తి ఏకంగా సుప్రీం కోర్టుకు (Supreme court ) ఎక్కాడు. మా పురుషుల కోసం కూడా ప్రత్యేక కమిషన్ వేసేలా కేంద్రాన్ని ఆదేశించండి అని కోరాడు. దీనికోసం ఆయన గత కొద్దీ ఏళ్లలో హింసకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న పురుషుల డేటా కూడా కోర్టుకు సమర్పించాడు.

ఈ అంశంపైనా పరిశోధన చేసి ‘నేషనల్ కమిషన్ ఫర్ మెన్’ లేదా అలాంటి మరేదైనా ఫోరమ్ ఏర్పాటు చేయడానికి అవసరమైన నివేదికను రూపొందించాలని కోరుతూ మహేష్ కుమార్ తివారీ అనే న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. గృహ హింస (Domestic valance) బాధితులు లేదా కుటుంబ సమస్యలు వివాహ సంబంధిత సమస్యల కారణంగా ఒత్తిడికి గురవుతున్న వారి ఫిర్యాదులను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సరైన మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు.

కుటుంబ సమస్యతో బాధపడుతున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించి ఆత్మహత్యలను నివారించేందుకు వారి మనోవేదనలను పరిష్కరించాలని పిటిషనర్ కోరారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి జిల్లా స్థాయిలో నోడల్ అధికారిని నియమించాలని అభ్యర్థించారు. కుటుంబ సమస్యలు వివాహ సంబంధిత సమస్యల కారణంగా దేశంలో పురుషుల ఆత్మహత్యల నిష్పత్తి వేగంగా పెరుగుతోందని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివరించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందించిన డేటా ప్రకారం 2021 సంవత్సరంలో భారతదేశంలో 164033 మంది ఆత్మహత్య చేసుకున్నారని . “లక్ష జనాభాలో ఆత్మహత్యల రేటు 12గా ఉందని ఇది 1967 నుండి ఆత్మహత్యల మరణాల రేటు అత్యధికం అని పిటిషనర్ వివరించారు.

“07.09.2021 నాటి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఆత్మహత్య అనేది భారతదేశంలో తీవ్రమైన సమస్య. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఆత్మహత్యల రేటు పెరుగుతోంది. 2021 సంవత్సరంలో ఆత్మహత్యలు గత సంవత్సరాలతో పోల్చితే 7.2 శాతం పెరిగాయి దేశంలో అత్యధిక సంఖ్యలో ఆత్మహత్యలు జరిగాయి’ అని పిటిషనర్ వివరించారు. ఈ పిటిషన్ మీద సుప్రీం కోర్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.