PM Kisan Yojana | రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు వచ్చేది అప్పుడే..! ఈ-కేవైసీ పూర్తి చేస్తేనే సాయం..!

PM Kisan Yojana | ఆరుగాలం కష్టించి దేశానికే అన్నం పెట్టే రైతన్న దిగుబడులు సరిగా లేక, పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక ఇబ్బందులుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఆర్థికంగా భద్రత కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజనను ప్రారంభించిన విషయం తెలిసిందే. పథకంలో భాగంగా ఏటా రైతులకు రూ.6వేల చొప్పున సహాయం అందిస్తున్నారు. ఈ […]

  • By: krs    latest    Jun 16, 2023 5:28 AM IST
PM Kisan Yojana | రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు వచ్చేది అప్పుడే..! ఈ-కేవైసీ పూర్తి చేస్తేనే సాయం..!

PM Kisan Yojana | ఆరుగాలం కష్టించి దేశానికే అన్నం పెట్టే రైతన్న దిగుబడులు సరిగా లేక, పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక ఇబ్బందులుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఆర్థికంగా భద్రత కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజనను ప్రారంభించిన విషయం తెలిసిందే. పథకంలో భాగంగా ఏటా రైతులకు రూ.6వేల చొప్పున సహాయం అందిస్తున్నారు. ఈ ఆర్థిక సాయాన్ని మూడు విడుతల్లో రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది.

అయితే, ఇప్పటి వరకు కేంద్రం 13 వాయిదాల్లో సాయాన్ని రైతుల ఖాతాలకు బదిలీ చేసింది. ప్రస్తుతం 14వ విడుత కోసం కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఎప్పుడు జమ చేస్తారనే విషయంపై ఇప్పటి వరకు కేంద్రం ప్రకటన చేయలేదు.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఈ నెలాఖరు జూన్లో‌ 30 లేదంటే జూలైలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తున్నది.

మరో వైపు ఇప్పటివరకు ఈ-కేవైసీ చేయించుకోని రైతులకు 14వ వాయిదాలో డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఆర్థిక సాయం ఖాతాల్లో జమ కావాలంటే తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాల్సిందే. కేంద్రం చివరిసారిగా ఫిబ్రవరి 27న 13వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే.