సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్.. టన్నెల్ ఘటనపై ఆరా
విధాత: నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ప్రధాని ఆరా తీశారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి వివరించారు. సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని సీఎం ప్రధానికి తెలిపపారు.
సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని సీఎం ప్రధానికి వివరించారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆరెఫ్ టీంను పంపిస్తామని ప్రధాని మోదీ సీఎంకు చెప్పారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram