Guvvala Balaraju| బీఆరెస్‌కు గువ్వ‌ల బాల‌రాజు రాజీనామా..9న బీజేపీలోకి

Guvvala Balaraju| బీఆరెస్‌కు గువ్వ‌ల బాల‌రాజు రాజీనామా..9న బీజేపీలోకి

హైద‌రాబాద్‌, ఆగ‌స్ట్‌4(విధాత‌): మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు(Guvvala Balaraju) బీఆరెస్‌(BRS)కు రాజీనామా (Resignation)చేశారు. ఈ మేర‌కు రాజీనామా లేఖ‌ను పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్‌(KCR)కు పంపించారు. అయితే గువ్వ‌ల బాల‌రాజు ఈనెల 9వ తేదీన అధికారికంగా బీజేపీ(BJP)లో చేర‌నున్న‌ట్లు స‌మాచారం. గువ్వ‌ల బాల‌రాజు ప్ర‌స్తుతం నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా బీఆరెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ప‌ని చేస్తున్నారు. గ‌త కొంత కాలంగా పార్టీ పై అసంతృప్తితో ఉన్న ఆయ‌న పార్టీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు ఆయ‌న సోమ‌వారం రాజీనామా చేశారు.

ఇదే దారిలో ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన మ‌రో ఇద్ద‌రు మాజీలు కూడా బీఆరెస్ పార్టీకి రాజీనామా చేసే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల‌లో జ‌రుగుతున్న‌ది.