Oscar Awards | తెలుగు ‘నాటు’ పాటకు ఆస్కార్‌.. వెల్లువెత్తుతున్న అభినందనలు..

Oscar Awards | ప్రపంచ సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డును తెలుగు సినిమాకు దక్కింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ‘నాటు నాటు’ సాంగ్‌ ఒరిజినల్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్నది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్‌ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు అభినందనలు తెలిపారు. ‘నాటు నాటు’ పాపులారిటీ ప్రపంచవ్యాప్తమైందన్నారు. చరిత్రలో మరుపురాని పాటగా నిలుస్తుందంటూ ప్రశంసించారు. […]

Oscar Awards | తెలుగు ‘నాటు’ పాటకు ఆస్కార్‌.. వెల్లువెత్తుతున్న అభినందనలు..

Oscar Awards | ప్రపంచ సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డును తెలుగు సినిమాకు దక్కింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ‘నాటు నాటు’ సాంగ్‌ ఒరిజినల్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్నది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్‌ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు అభినందనలు తెలిపారు. ‘నాటు నాటు’ పాపులారిటీ ప్రపంచవ్యాప్తమైందన్నారు. చరిత్రలో మరుపురాని పాటగా నిలుస్తుందంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా కీరవాణి, చంద్రబోస్‌తో బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో అవార్డు అందుకున్న ‘ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ బృందాన్ని సైతం మోదీ అభినందించారు.

తండిగ్రా గర్వపడుతున్నానన్న చిరంజీవి..

ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాటకు ఆస్కార్‌ రావడంపై మెగాస్టార్‌ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు చెప్పారు. చిత్రంలో చరణ్ కూడా ఇందులో భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఆర్ఆర్ఆర్‌ను ఆస్కార్​కు తీసుకెళ్లేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు దక్కాలని అభిప్రాయపడ్డారు. రాజమౌళి, కీరవాణి, తారక్, చరణ్ ఎంతో కష్టపడ్డారన్న మెగాస్టార్‌ ఓ తండ్రిగా గర్వపడుతున్నానన్నారు. టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున సైతం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ‘భారతీయ సినిమాకు ఇదొక చారిత్రక ఘట్టం’ అంటూ ట్వీట్‌ చేశారు. సినీ అభిమానులనే కాదు, ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశారని ప్రశంసించారు.