PM Modi | సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ
విధాత: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడవనున్న ఈ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని 10వ నంబర్ ప్లాట్‌ఫాంపై జెండా ఊపి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని ప్రారంభించారు. అందులో కొంతమంది విద్యార్థులు నల్గొండ వరకు ప్రయాణిస్తారు. రైలు బయలుదేరే ముందు విద్యార్థులతో ప్రధాని కాసేపు మాట్లాడారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీతో పాటు రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర […]

విధాత: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడవనున్న ఈ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని 10వ నంబర్ ప్లాట్‌ఫాంపై జెండా ఊపి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని ప్రారంభించారు. అందులో కొంతమంది విద్యార్థులు నల్గొండ వరకు ప్రయాణిస్తారు. రైలు బయలుదేరే ముందు విద్యార్థులతో ప్రధాని కాసేపు మాట్లాడారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీతో పాటు రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని పాల్గొన్నారు.
సభా వేదిక పైనుంచి ప్రజలకు అభివాదం తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రధాని మోడీకి వెంకటేశ్వరస్వామి విగ్రహం అందజేశారు. సభలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, అశ్వనీ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు