Modi Tour | మోదీ ఏడు దేశాల పర్యటన ఖర్చు ఎంతో తెలుసా?
Modi Tour | విధాత: మే-జూలై నెలల్లో ప్రధాని నరేంద్రమోదీ అమెరికా, ఫ్రాన్స్ సహా ఏడు దేశాల్లో పర్యటనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రెండు దేశాలతో పాటు జపాన్, పపువా న్యూగినియా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో ఆయన పర్యటించారు. అయితే.. ఈ పర్యటనలకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు కోటీ 79 లక్షలని అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. మోదీ మే 19 నుంచి […]

Modi Tour |
విధాత: మే-జూలై నెలల్లో ప్రధాని నరేంద్రమోదీ అమెరికా, ఫ్రాన్స్ సహా ఏడు దేశాల్లో పర్యటనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రెండు దేశాలతో పాటు జపాన్, పపువా న్యూగినియా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో ఆయన పర్యటించారు.
అయితే.. ఈ పర్యటనలకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు కోటీ 79 లక్షలని అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. మోదీ మే 19 నుంచి జూలై 15 మధ్యలో ఏడు దేశాలను పర్యటించారని, ఇందుకు అయిన ఖర్చు 1,79,38,717 రూపాయలని పేర్కొన్నది.
ప్రధానితోపాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా విదేశాలకు వెళ్లారు. అయితే.. ఇది ప్రధాని పర్యటన ఖర్చు మాత్రమేనని, మంత్రులు, ఇతర అధికారుల పర్యటనల ఖర్చు సంబంధిత శాఖలు భరించాయని వెల్లడించింది.