Mahabubnagar | నువ్వా.. నేనా.. బీరం, జూపల్లి మధ్య మొదలైన పొలిటికల్ వార్

Mahabubnagar | పరస్పరం విమర్శల దాడి జూపల్లికి చెక్ పెట్టేందుకు రంగంలోకి బీఆర్ఎస్ అధిష్టానం కొల్లాపూర్ లో ఇతర పార్టీల ముఖ్య నేతలపై బీఆర్ఎస్ ఫోకస్ విధాత, ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రతినిధి: కొల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రగులుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల నేతల మధ్య దూషణల పర్వం ప్రారంభమైoది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, బీఆరెస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇందుకు ముఖ్య […]

Mahabubnagar | నువ్వా.. నేనా.. బీరం, జూపల్లి మధ్య మొదలైన పొలిటికల్ వార్

Mahabubnagar |

  • పరస్పరం విమర్శల దాడి
  • జూపల్లికి చెక్ పెట్టేందుకు రంగంలోకి బీఆర్ఎస్ అధిష్టానం
  • కొల్లాపూర్ లో ఇతర పార్టీల ముఖ్య నేతలపై బీఆర్ఎస్ ఫోకస్

విధాత, ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రతినిధి: కొల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రగులుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల నేతల మధ్య దూషణల పర్వం ప్రారంభమైoది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, బీఆరెస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇందుకు ముఖ్య వేదికగా సోషల్ మీడియా ను ఎంచుకున్నారు. ఇరువర్గాల నాయకులు ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

జూపల్లి కృష్ణారావు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి బీఆరెస్ పార్టీ నాయకులకు నిద్ర పట్టని పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి జూపల్లిని టార్గెట్ చేసి అడుగడుగునా విమర్శలు చేస్తున్నారు. బీఆరెస్‌లో మంత్రి పదవి నిర్వహించినా కొల్లాపూర్ అభివృద్ధిలో జూపల్లి శ్రద్ధ చూపలేదని, కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారనే ఆరోపణలు ఎమ్మెల్యే బీరo చేస్తున్నారు.

డబ్బులకు ఆశ పడి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికై బీఆరెస్‌లో చేరిన ఘనత బీరంకే దక్కిందని జూపల్లి వర్గం విమర్శలు చేస్తున్నారు. ఎలాగైన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జూపల్లికి చెక్ పెట్టకపోతే పరువు పోతుందనే ఆలోచనలో బీఆరెస్‌ ఉంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీ ఆర్ ఎస్ జెండా ఎగుర వేయాలనే సంకల్పంలో ఆ పార్టీ అధిష్టానం సమాలోచనలు చేస్తోంది.

జూపల్లి టార్గెట్‌

జూపల్లి టార్గెట్‌గా కొల్లాపూర్ నియోజకవర్గం పై కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. జూపల్లి కాంగ్రెస్ పార్టీ లో చేరిన వెంటనే ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తో ప్రతేకంగా మాట్లాడినట్లు నియోజకవర్గం లో టాక్ వినిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ లో ఉన్న బీరం అనుచరులపై బీఆరెస్ దృష్టి పెట్టింది. వారితో టచ్ లో ఉండాలని బీరంకు సూచించారు.

జూపల్లి వెంట ఉన్న బీఆరెస్ నాయకులను తమ వైపు తిప్పుకునే యోచనలో ఆ పార్టీ ఉంది. ఇప్పటికే కొందరు నేతల లిస్ట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితిలో జూపల్లిని రాజకీయ సన్యాసం చేసే దిశగా బీఆరెస్‌ అధిష్టానం పావులు కడుపుతోంది. గతంలో బీఆరెస్ నుంచి రెండు సార్లు టికెట్ ఆశించి జూపల్లి కోసం త్యాగం చేసిన మావిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఈ సారి టికెట్ తనకే ఇవ్వాలని కేటిఆర్ ను సంప్రదించారు.

బీరం కన్నా బలమైన నేతగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డిపై కూడా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. జూపల్లికి గట్టి పోటీ ఇచ్చేందుకు విష్ణువర్ధన్ రెడ్డికి సాధ్యం అవుతుందనే విషయాన్ని బీఆరెస్ భావిస్తోంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో జూపల్లికి చెక్ పెట్టాలనే ఉదేశ్యం తో బీఆరెస్‌ కొల్లాపూర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టింది.

కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నియోజకవర్గంలో జూపల్లిని గెలిపించి అధికార పార్టీని ఖంగు తినిపించాలని అనుకుంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను ఒక్కతాటి పైకి తెచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రయత్నం మొదలుపెట్టారు. రానున్న ఎన్నికల్లో మాత్రం కొల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారనుంది.