జ‌నాభా లెక్కలు 2023 లోనే

విధాత‌, హైద‌రాబాద్‌: ప్ర‌తి ప‌దేళ్ల‌కు ఒక‌సారి చేయవలసిన జ‌నగణన ఇప్ప‌ట్లో పూర్తి చేసే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. నిజానికి 2021లోనే జ‌న‌గ‌ణ‌న చేయ‌వ‌ల‌సి ఉండింది. కోవిడ్ కార‌ణంగా జ‌న‌గ‌ణ‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. కోవిడ్ స‌మ‌స్య తొల‌గిపోయినా ఇప్ప‌టికీ జ‌న‌గ‌ణ‌న ప్రారంభించ‌డంలో తాత్సారం జ‌రుగుతున్న‌ది. ప‌రిపాల‌నా విభాగాల స‌రిహ‌ద్దులను డిసెంబ‌రు 31, 2022లోపు ఖరారు చేయాలని రిజిస్ట్రారు జనరల్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. అంటే ఆ త‌ర్వాత‌నే జ‌న‌గ‌ణ‌న […]

జ‌నాభా లెక్కలు 2023 లోనే

విధాత‌, హైద‌రాబాద్‌: ప్ర‌తి ప‌దేళ్ల‌కు ఒక‌సారి చేయవలసిన జ‌నగణన ఇప్ప‌ట్లో పూర్తి చేసే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. నిజానికి 2021లోనే జ‌న‌గ‌ణ‌న చేయ‌వ‌ల‌సి ఉండింది. కోవిడ్ కార‌ణంగా జ‌న‌గ‌ణ‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. కోవిడ్ స‌మ‌స్య తొల‌గిపోయినా ఇప్ప‌టికీ జ‌న‌గ‌ణ‌న ప్రారంభించ‌డంలో తాత్సారం జ‌రుగుతున్న‌ది.

ప‌రిపాల‌నా విభాగాల స‌రిహ‌ద్దులను డిసెంబ‌రు 31, 2022లోపు ఖరారు చేయాలని రిజిస్ట్రారు జనరల్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. అంటే ఆ త‌ర్వాత‌నే జ‌న‌గ‌ణ‌న చేప‌ట్టే అవ‌కాశం ఉంది.

2023 వేసవిలో జనగణన చేపట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన జనాభా వివరాలు 2023 చివరలో కానీ 2024 ఆరంభంలో కానీ బయటికి వస్తాయి. జనాభా విరాల సేకరణ ఈ సారి ఆధునిక పద్ధతుల్లో జరుగుతుందని, వివరాల నమోదు వేగంగా జరుగుతుందని, సమాచార గణన సులభతరమవుతుందని చెబుతున్నారు.

జనాభా వివరాలు లేకపోవడం వల్ల పథకాల రూపకల్పన, అమలు, నిధుల కేటాయింపు సందర్భంగా సమస్యలు తలెత్తుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కులగణన కూడా చేయాలని వెనుకబడిన వర్గాలు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీలు కూడా కులగణన చేయాలని తీర్మాణాలు చేశాయి. కేంద్రం మాత్రం అందుకు ససేమిరా అంటున్నది.