చండూరు టౌన్‌లో పోస్టర్ల కలకలం.. రాత్రికిరాత్రే Phone Pay తరహాలో

విధాత: మునుగోడు ఉప ఎన్నిక రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. బీజేపీ అభ్య‌ర్థి రాజ‌గోపాల్ రెడ్డిని అటు అధికార పార్టీ టీఆర్ఎస్, ఇటు సిట్టింగ్ అభ్య‌ర్థి పాల్వాయి స్ర‌వంతి టార్గెట్ చేశారు. రాజ‌గోపాల్ రెడ్డి కాంట్రాక్ట్‌ల‌ను అస్త్రంగా చేసుకుని, ఈ రెండు పార్టీలు ప్ర‌చారం చేస్తున్నాయి. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను అప్ప‌నంగా క‌ట్ట‌బెట్టినందుకే, రాజ‌గోపాల్ బీజేపీలో చేరార‌ని ఈ రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రాత్రికి రాత్రే రాజ‌గోపాల్‌కి వ్య‌తిరేకంగా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో పోస్ట‌ర్లు […]

  • By: krs    latest    Oct 11, 2022 4:31 AM IST
చండూరు టౌన్‌లో పోస్టర్ల కలకలం.. రాత్రికిరాత్రే Phone Pay తరహాలో

విధాత: మునుగోడు ఉప ఎన్నిక రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. బీజేపీ అభ్య‌ర్థి రాజ‌గోపాల్ రెడ్డిని అటు అధికార పార్టీ టీఆర్ఎస్, ఇటు సిట్టింగ్ అభ్య‌ర్థి పాల్వాయి స్ర‌వంతి టార్గెట్ చేశారు. రాజ‌గోపాల్ రెడ్డి కాంట్రాక్ట్‌ల‌ను అస్త్రంగా చేసుకుని, ఈ రెండు పార్టీలు ప్ర‌చారం చేస్తున్నాయి. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను అప్ప‌నంగా క‌ట్ట‌బెట్టినందుకే, రాజ‌గోపాల్ బీజేపీలో చేరార‌ని ఈ రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రాత్రికి రాత్రే రాజ‌గోపాల్‌కి వ్య‌తిరేకంగా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో పోస్ట‌ర్లు వెలిశాయి. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చండూరు టౌన్‌లో వెలిసిన పోస్ట‌ర్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. Phone Pay తరహాలో Contract Pay పేరిట పోస్ట‌ర్లు వెలిశాయి. రూ. 18,000 కోట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించడం జరిగిందని చండూరు వ్యాప్తంగా వెలిశాయి.

ఇప్పుడు ఈ పోస్ట‌ర్ల‌పైనే స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌ర‌గుతోంది. ఈ పోస్టర్లు ఎవరు అంటించారనేది తెలియరాలేదు. రాత్రికి రాత్రే పోస్టర్లను టీఆర్ఎస్ నాయకులైన, లేకకాంగ్రెస్ నాయకులైన అంటించి ఉంటారని కోమటిరెడ్డి వర్గం చెబుతుంది. మరి దీనిపై వారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

రాజ‌గోపాల్ రెడ్డికి వ్య‌తిరేకంగా పోస్ట‌ర్లు వెలియ‌డం ఇదే తొలిసారి కాదు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరిన అనంత‌రం కూడా పోస్ట‌ర్లు వెలిశాయి. మునుగోడు నిన్ను క్ష‌మించ‌దు అంటూ వెలిసిన పోస్ట‌ర్లు తీవ్ర దుమారాన్ని రేపిన సంగ‌తి తెలిసిందే.

13 ఏండ్ల‌ నమ్మకాన్ని ఓ కాంట్రాక్టు కోసం రూ.18 వేల కోట్లకు కక్కుర్తి పడి పార్టీ మారిన నీచుడివి అంటూ గతంలో పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ఈడీ వేధిస్తున్న రోజే అమిత్ షాతో బేరమాడావ్ అంటూ ప్రతిపక్ష నాయకులు విమర్శల వర్షం కురిపించారు.