Pragya Rover | చంద్రునిపై మూడు సింహాల ముద్ర, ఇస్రో లోగోనూ ముద్రించిన ప్రజ్ఞ రోవర్‌

Pragya Rover | Chandrayaan3 | శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ముర్ము అభినందనలు బెంగళూరు : ఈసారి ఏ దేశమైనా చంద్రునిపై రోవర్‌ను పంపిస్తే.. దానికి భారతదేశ జాతీయ చిహ్నమైన మూడు సింహాలు, ఇస్రో లోగో కనిపిస్తాయి. ఈ రెండింటినీ విక్రం ల్యాండర్‌ తీసుకుపోయిన ప్రజ్ఞ రోవర్‌ చంద్రునిపై ముద్రించింది. బుధవారం చంద్రునిపై విజయవంతంగా దిగిన విక్రం నుంచి కొద్ది గంటల తర్వాత రోవర్‌ ప్రజ్ఞ బయటకు వచ్చి.. చంద్రునిపై నడయాడింది. ఈ సమయంలో రోవర్‌కు వెనుక ఉన్న […]

  • By: krs    latest    Aug 24, 2023 4:30 PM IST
Pragya Rover | చంద్రునిపై మూడు సింహాల ముద్ర, ఇస్రో లోగోనూ ముద్రించిన ప్రజ్ఞ రోవర్‌

Pragya Rover | Chandrayaan3 |

శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ముర్ము అభినందనలు

బెంగళూరు : ఈసారి ఏ దేశమైనా చంద్రునిపై రోవర్‌ను పంపిస్తే.. దానికి భారతదేశ జాతీయ చిహ్నమైన మూడు సింహాలు, ఇస్రో లోగో కనిపిస్తాయి. ఈ రెండింటినీ విక్రం ల్యాండర్‌ తీసుకుపోయిన ప్రజ్ఞ రోవర్‌ చంద్రునిపై ముద్రించింది. బుధవారం చంద్రునిపై విజయవంతంగా దిగిన విక్రం నుంచి కొద్ది గంటల తర్వాత రోవర్‌ ప్రజ్ఞ బయటకు వచ్చి.. చంద్రునిపై నడయాడింది.

ఈ సమయంలో రోవర్‌కు వెనుక ఉన్న చక్రాలపై మూడు సింహాల చిహ్నంతోపాటు.. ఇస్రో లోగోనూ ముద్రించేలా చంద్రయాన్‌-3 బృందం ఏర్పాట్లు చేసింది. ప్రజ్ఞ రోవర్‌పై ఇస్రో విడుదల చేసిన ప్రత్యేక యానిమేషన్‌లో ఈ వివరాలు ఉన్నాయి.

విజయవంతంగా తిరుగుతున్న ప్రజ్ఞ

విక్రం నుంచి బయటకు వచ్చిన రోవర్‌ ప్రజ్ఞ.. చంద్రునిపై కాలుమోపింది. అన్ని కార్యకలాపాలు షెడ్యూలు ప్రకారం సాగుతున్నాయని ఇస్రో గురువారం వెల్లడించింది. అన్ని వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని తెలిపింది. ల్యాండర్‌లోని పేలోడ్స్‌ ఐఎల్‌ఎస్‌ఏ, రంభ, చాస్టేలను గురువారం యాక్టివేట్‌ చేసినట్టు పేర్కొన్నది. రోవర్‌ మొబిలిటీ ఆపరేషన్లు కూడా మొదలైనట్టు తెలిపింది.

ఇస్రోకు రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము శుభాకాంక్ష‌లు

చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. “విక్రమ్-ల్యాండర్ లోపల నుంచి ప్రజ్ఞాన్-రోవర్‌ను విజయవంతంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చి అధ్య‌య‌నం ప్రారంభించినందుకు ఇస్రో బృందానికి, తోటి పౌరులందరికీ నేను మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. విక్రమ్ ల్యాండింగ్ అయిన కొన్ని గంటల తర్వాత చంద్రయాన్- 3 మరో దశ విజయవంతమైంది.” అని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గురువారం ఉదయం ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

దుమ్మురేపిన చంద్రయాన్ సక్సెస్

చందమామ మీద ల్యాండ్ అయ్యే ప్రక్రియను ఆసాంతం ఇస్రో, ఇంకొన్ని వెబ్సైట్స్ ప్రత్యక్ష ప్రసారం చేసాయి. ఆ ప్రక్రియ లైవ్ చూసే విషయంలో కూడా భారత్ పెద్ద చరిత్ర సృష్టించింది. గతంలో ప్రపంచంలోని ఏ కార్యక్రమాన్నీ ప్రజలు యింత ఆసక్తితో చూడలేదని తేలింది. ఈ కార్యక్రమాన్ని ఏకంగా 86 లక్షలమంది లైవ్ చూశారు.