Horoscope | మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆదాయానికి మించిన ఖర్చులు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితులు మీకు అనుకూలంగా మార్చుకుంటారు. ఆర్థిక ప్రణాళికలు సమయానుకూలంగా అమలు చేయడం వల్ల ఆర్ధిక స్థిరత్వం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. సర్వత్రా అనుకూలత సిద్ధిస్తుంది. అన్ని రకాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శ్రద్ధ తగ్గకుండా చూసుకోండి. స్నేహితుల ద్వారా ఆర్థిక లబ్ది పొందుతారు. వృత్తి పరంగా చేసే ప్రయాణాలు ఫలిస్తాయి. కుటుంబ కలహాలు అశాంతి కలిగిస్తాయి. సహనంతో మెలగడం అవసరం.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కాలం సహకరించడం లేదు కాబట్టి ప్రతి పనిలోనూ జాగ్రత్త అవసరం. అన్ని రంగాల వారు అధిక పనిభారంతో ఒత్తిడికి గురవుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. భూ గృహ వాహన యోగాలున్నాయి. కుటుంబంలో అనవసర గొడవలు, వివాదాలు ఏర్పడకుండా చూసుకోండి. కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు వచ్చినా మధ్యలో ఆపవద్దు. పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. ఇంటా బయటా వివాదాలు రాకుండా మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అదృష్టకాలం నడుస్తోంది. ఏ పని తలపెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అంచెలంచెలుగా ఎదగవచ్చు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు ఎదురవుతాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. స్థానచలనం సూచన కూడా ఉంది. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలకు అనువైన సమయం.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో ఆటుపోట్లు ఉండవచ్చు. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండండి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. అనుమానాస్పద అంశాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆర్థికంగా ఖర్చులు బాగా పెరుగుతాయి. కొందరి ప్రవర్తన మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అత్యంత అనుకూలమైన కాలం నడుస్తోంది. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. సహచరుల సహకారంతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. పరోపకార కార్యక్రమాలతో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram