గర్భిణి అని చూడకుండా టీచర్‌తో విద్యార్థుల అసభ్య ప్రవర్తన
Assam | ఇంటర్ చదువుతున్న కొంత మంది విద్యార్థులు మహిళా టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. గర్భిణి అని చూడకుండా ఆమెను అడ్డుకుని హింసించారు. కొందరు టీచర్ జుట్టు పట్టి లాగేందుకు యత్నించారు. ఈ ఘటన అసోంలోని దిబ్రుగర్హ్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. దిబ్రుగర్హ్ జిల్లాలోని మోరాన్ ఏరియాలో జవహర్ నవోదయ విద్యాలయం ఉంది. అయితే ఇటీవలే ఈ విద్యాలయంలో పేరెంట్స్ టీచర్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. హిస్టరీ బోధించే టీచర్.. కొంత […]

Assam | ఇంటర్ చదువుతున్న కొంత మంది విద్యార్థులు మహిళా టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. గర్భిణి అని చూడకుండా ఆమెను అడ్డుకుని హింసించారు. కొందరు టీచర్ జుట్టు పట్టి లాగేందుకు యత్నించారు. ఈ ఘటన అసోంలోని దిబ్రుగర్హ్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. దిబ్రుగర్హ్ జిల్లాలోని మోరాన్ ఏరియాలో జవహర్ నవోదయ విద్యాలయం ఉంది. అయితే ఇటీవలే ఈ విద్యాలయంలో పేరెంట్స్ టీచర్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. హిస్టరీ బోధించే టీచర్.. కొంత మంది విద్యార్థులను ఉద్దేశించి, వారు సరిగా చదవట్లేదని పేరెంట్స్‌కు చెప్పింది. దీంతో ఆ టీచర్‌పై సదరు విద్యార్థులు కక్ష పెంచుకున్నారు. ఐదు నెలల గర్భిణి అని కూడా చూడకుండా.. ఆ టీచర్ పట్ల విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించారు. కింద తోసేశారు. అంతటితో ఆగకుండా ఆ టీచర్ జుట్టు పట్టి లాగేందుకు యత్నించారు. విద్యార్థుల దాడి నుంచి తోటి టీచర్లు, విద్యార్థినులు కలిసి టీచర్‌ను కాపాడారు. అప్పటికే స్పృహ కోల్పోవడంతో ఆమెను ఆటోలో సమీప ఆస్పత్రికి తరలించారు.
ఈ పరిణామాలపై జవహర్ నవోదయ విద్యాలయం వైస్ ప్రిన్సిపల్ రతీశ్ కుమార్ టీచర్‌పై దాడి చేసిన విద్యార్థుల పేరెంట్స్‌కు ఫోన్ చేసి, జరిగిన విషయాన్ని చెప్పాడు. త్వరగా విద్యాలయం క్యాంపస్‌కు రావాలని తల్లిదండ్రులను ప్రిన్సిపల్ ఆదేశించాడు. ఈ విషయం విద్యార్థులకు తెలియడంతో.. ప్రిన్సిపల్‌కు ఫోన్ చేసి బెదిరించారు. అంతటితో ఆగకుండా ప్రిన్సిపల్‌ను కొట్టేందుకు అతని క్వార్టర్స్ వైపు విద్యార్థులు దూసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ మిగతా టీచర్ల సహాయంతో స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.