పాక్ నెత్తిన ‘పెట్రో’ పిడుగు.. లీటర్‌కు ఏకంగా రూ.272కి చేరిన ధర

Pakistan | దాయాది దేశం పాక్‌లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్నది. దాంతో ఇప్పటికే ఆహార సంక్షోభం తీవ్రమైంది. ఈ క్రమంలో షాబాజ్‌ ప్రభుత్వం ఐఎంఎఫ్‌ నుంచి రుణం తీసుకునేందుకు ప్రజల పెనుభారాన్ని మోపింది. ఫలితంగా పాక్‌లో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం పాక్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.272కు, డీజిల్‌ లీటర్‌ రూ.280కి చేరింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో ప్రజలకు కష్టాలు పెరగనున్నాయి. పార్లమెంట్‌లో కొత్త అనుబంధ ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత షెహ‌బాజ్‌ షరీఫ్‌ […]

పాక్ నెత్తిన ‘పెట్రో’ పిడుగు.. లీటర్‌కు ఏకంగా రూ.272కి చేరిన ధర

Pakistan | దాయాది దేశం పాక్‌లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్నది. దాంతో ఇప్పటికే ఆహార సంక్షోభం తీవ్రమైంది. ఈ క్రమంలో షాబాజ్‌ ప్రభుత్వం ఐఎంఎఫ్‌ నుంచి రుణం తీసుకునేందుకు ప్రజల పెనుభారాన్ని మోపింది. ఫలితంగా పాక్‌లో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం పాక్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.272కు, డీజిల్‌ లీటర్‌ రూ.280కి చేరింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో ప్రజలకు కష్టాలు పెరగనున్నాయి. పార్లమెంట్‌లో కొత్త అనుబంధ ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత షెహ‌బాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ఇంధన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం నిర్ణయంతో ఇంధన ధరలు ఏకంగా రూ.22 పెరిగాయి.

ప్రభుత్వం నిర్ణయం పెట్రోల్‌ ధర ఒకేసారి రూ.22.20 పెంచడంతో లీటర్‌కు రికార్డు స్థాయిలో రూ.272, డీజిల్‌ రూ.280కి చేరింది. అదే సమయంలో కిరోసిన్‌ ఆయిల్‌ లీటర్‌కు రూ.202 చేరిందని స్థానిక మీడియా తెలిపింది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తగ్గిపోతుండడంతో ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నిర్దేశించిన షరతుల కారణంగా ఇంధన ధరల పెంపు అనివార్యమైంది. రుణాన్ని తిరిగి చెల్లించే బదులు ఐఎంఎఫ్‌ షరతులకు అంగీకరించాల్సిన దుస్థితి ఎదురైంది. ఇక పాల ధర లీటర్‌కు రూ.210కి చేరగా.. చికెన్‌ కిలో రూ.780కి చేరింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో పరిస్థితి మరింత దిగజారేలా కనిపిస్తున్నది. ప్రభుత్వం తీరుపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.