Koppula Eshwar | మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు చేదు అనుభవం.. నిలదీసిన గ్రామస్తులు
ఇథనాల్ ఫ్యాక్టరీ భూమి పూజకు వచ్చిన మంత్రిని నిలదీసిన గ్రామస్తులు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న ప్రజలు కాలుష్యం వెదజల్లే ఆ ఫ్యాక్టరీ తమకు వద్దంటూ డిమాండ్ ప్రజలకు సమాధానం చెప్పకుండానే వెనుతిరిగిన మంత్రి రాయపట్నం,కరీంనగర్ జాతీయ రహదారిపై గ్రామస్తుల ఆందోళన విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) కు చేదు అనుభవం ఎదురైంది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామలో ఇథనాల్ రైస్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమకు […]
- ఇథనాల్ ఫ్యాక్టరీ భూమి పూజకు వచ్చిన మంత్రిని నిలదీసిన గ్రామస్తులు
- మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న ప్రజలు
- కాలుష్యం వెదజల్లే ఆ ఫ్యాక్టరీ తమకు వద్దంటూ డిమాండ్
- ప్రజలకు సమాధానం చెప్పకుండానే వెనుతిరిగిన మంత్రి
- రాయపట్నం,కరీంనగర్ జాతీయ రహదారిపై గ్రామస్తుల ఆందోళన
విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) కు చేదు అనుభవం ఎదురైంది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామలో ఇథనాల్ రైస్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమకు భూమి పూజ చేసేందుకు వచ్చిన ఆయనను స్థానికులు నిలదీశారు. కాన్వాయ్‌ని అడ్డుకొని ఆందోళన చేస్తున్నారు.
తమ గ్రామంలో ఈ ఫ్యాక్టరీ నిర్మించడానికి వీలు లేదని, దీనిపై వెంటనే సమాధానం చెప్పాలని వారు మంత్రిని నిలదీశారు. గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండానే మంత్రి వెనుతిరిగి పోయారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు రాయపట్నం – కరీంనగర్ ప్రధాన రహదారిపై క్రిమిసంహారక మందు డబ్బాలు చేత పట్టుకొని ఆందోళన సాగిస్తున్నారు.
వెల్గటూర్ మండలం పాశిగామలో 700 కోట్లతో ఇథనాల్ రైస్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమ నెలకొల్పాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు అవసరమైన భూమి కూడా కేటాయించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూమి పూజ చేయడానికి శుక్రవారం గ్రామానికి చేరుకున్న సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అనూహ్యంగా గ్రామస్తుల నిరసన చవిచూశారు.
ఈ ఫ్యాక్టరీ గ్రామంలో నిర్మించడానికి వీలు లేదంటూ స్థానికులు మంత్రి కాన్వాయ్ కి అడ్డుపడడంతోపాటు రహదారిపై బైఠాయించి ఆందోళన తెలిపారు. కాలుష్యాన్ని వెదజల్లే ఈ ఫ్యాక్టరీని తమ గ్రామం నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని వారు మంత్రిని నిలదీశారు.
అయితే గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో గంటకు పైగా ఆందోళన కొనసాగుతుండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు స్థానిక పోలీసులు కోటిలింగాల మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు.
X





Google News
Facebook
Instagram
Youtube
Telegram