Manchiryala: ‘ఎల్లంపల్లి’ భూనిర్వాసితులకు పరిహార బకాయిలు చెల్లించాలని BJP ఆధ్వర్యంలో నిరసన
విధాత: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో ముంపు బాధిత భూ నిర్వాసితులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు క్రింద లక్షట్టిపెట్, హజీపూర్ మండలాలలో ముంపునకు గురై భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. […]

విధాత: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో ముంపు బాధిత భూ నిర్వాసితులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు క్రింద లక్షట్టిపెట్, హజీపూర్ మండలాలలో ముంపునకు గురై భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏవో కు వినతి పత్రం అందజేశారు
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించి 14 ఏండ్లు దాటింది. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని అన్నారు. అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించకపోవడంతో వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న దివాకర్ రావు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు అప్పుడు ప్రాజెక్ట్ నిర్మాణంలో కమీషన్లు దండుకుని పేద ప్రజలకు అన్యాయం చేశారని అరోపించారు. ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మళ్లీ ఎమ్మెల్యేగా ఉన్న దివాకర్ రావు ముంపు బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం లేదని అన్నారు. ఎల్లంపల్లి ముంపు బాధితులకు రావాల్సిన బకాయిలు చెల్లించే వరకు బిజెపి తరఫున పోరాటం చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం వారికి పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బొప్పు కిషన్, దమెరకుంట నరసయ్య, శ్రీ రామ్, బెక్కం బుమేష్, తోట మల్లికార్జున్, పట్టి వెంకట కృష్ణ, ముదాం మల్లేష్, రెడ్డిమల్ల అశోక్, అమిరిషెట్టి రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.