Punjab | ఐపీఎస్ ఆఫీస‌ర్‌ను పెళ్లాడ‌నున్న ఎడ్యుకేష‌న్ మినిస్ట‌ర్

Punjab | ఆమ్ ఆద్మీ పార్టీ( AAP ) ఎమ్మెల్యే హ‌ర్‌జోత్ సింగ్ బెయిన్స్( Harjot Singh Bains ) త్వ‌ర‌లోనే ఓ ఇంటి వాడు కాబోతున్నారు. పంజాబ్ కేడ‌ర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ జ్యోతి యాద‌వ్‌( IPS Jyoti Yadav )ను పెళ్లి చేసుకోబోతున్నారు. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ ఒక్క‌టి కాబోతున్నార‌ని పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇటీవ‌లే హ‌ర్‌జోత్‌, జ్యోతి నిశ్చితార్థం జ‌రిగింద‌ని స‌మాచారం. పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్( Anandpur Sahib ) నియోజ‌క‌వ‌ర్గం నుంచి హ‌ర్‌జోత్ […]

Punjab | ఐపీఎస్ ఆఫీస‌ర్‌ను పెళ్లాడ‌నున్న ఎడ్యుకేష‌న్ మినిస్ట‌ర్

Punjab | ఆమ్ ఆద్మీ పార్టీ( AAP ) ఎమ్మెల్యే హ‌ర్‌జోత్ సింగ్ బెయిన్స్( Harjot Singh Bains ) త్వ‌ర‌లోనే ఓ ఇంటి వాడు కాబోతున్నారు. పంజాబ్ కేడ‌ర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ జ్యోతి యాద‌వ్‌( IPS Jyoti Yadav )ను పెళ్లి చేసుకోబోతున్నారు. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ ఒక్క‌టి కాబోతున్నార‌ని పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇటీవ‌లే హ‌ర్‌జోత్‌, జ్యోతి నిశ్చితార్థం జ‌రిగింద‌ని స‌మాచారం.

పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్( Anandpur Sahib ) నియోజ‌క‌వ‌ర్గం నుంచి హ‌ర్‌జోత్ సింగ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీఎం భ‌గ‌వంత్ మాన్( CM Bhagwant Mann ) కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రి( Education Minister ) గా కొన‌సాగుతున్నారు సింగ్. 2017 ఎన్నిక‌ల్లో షానేవాల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో పంజాబ్ యూనివ‌ర్సిటీ నుంచి బీఏ ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. అనంత‌రం ఆప్‌లో చేరి పంజాబ్ రాజ‌కీయాల్లో క్రియాశీల‌క పాత్ర పోషించారు. హ‌ర్‌జోత్ సొంతూరు ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజ‌క‌వ‌ర్గంలోని గంభీర్‌పూర్.

పంజాబ్ కేడ‌ర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ జ్యోతి యాద‌వ్ మాన్సా జిల్లా ఎస్పీగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. జ్యోతి యాద‌వ్ సొంతూరు హ‌ర్యానాలోని గురుగ్రామ్. ఇక హ‌ర్‌జోత్‌, జ్యోతి వివాహానికి ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్ హాజ‌రు కానున్నారు.