Qawwal Tiger Zone | వన్యప్రాణుల సంరక్షణ అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన..
Qawwal Tiger Zone జన్నారం FDO మాధవరావు విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో గల అటవీ శాఖ జన్నారం డివిజన్ తాళ్లపేట్, జన్నారం రేంజ్ సూదిలొద్ది కుంట నుండి లోతురే జన్నారం రేంజ్ వరకు దాదాపు 40 కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేసిన వాహనాలలో అధికారులు ప్రయాణిస్తూ అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జన్నారం FDO మాధవరావు మాట్లాడుతూ…. […]
Qawwal Tiger Zone
- జన్నారం FDO మాధవరావు
విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో గల అటవీ శాఖ జన్నారం డివిజన్ తాళ్లపేట్, జన్నారం రేంజ్ సూదిలొద్ది కుంట నుండి లోతురే జన్నారం రేంజ్ వరకు దాదాపు 40 కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేసిన వాహనాలలో అధికారులు ప్రయాణిస్తూ అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జన్నారం FDO మాధవరావు మాట్లాడుతూ…. అడవుల సంరక్షణ గడ్డి క్షేత్రాల ఏర్పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం దాదాపు జన్నారం డివిజన్ పరిధిలో 23 సోలార్ ల సహాయంతో బోర్ మోటార్లను ఏర్పాటు చేసి నీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. పర్యాటకులు అడవి అందాలను చూడడానికి వాచ్ టవర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

రోడ్డు మ్యాప్ ద్వారా అటవీశాఖ అధికారులు అడవులలో ప్రయాణించడానికి దాదాపు 3 సంవత్సరాల వ్యవధిలో మట్టి రోడ్డును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మౌస్ డీర్ సంరక్షణకు ఏర్పాట్లను పూర్తి చేశామని అన్నారు. వన్యప్రాణుల కోసం చెక్ డ్యాములను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జన్నారం, ఇందన్‌పళ్లి ఎఫ్ ఆర్ ఓ లక్ష్మీనారాయణ, ఆఫీస్ఉద్దీన్ అటవీ శాఖ అధికారులు బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram