ఇక చిల్లరే.. చిల్లర: RBI క్యూఆర్ కాయిన్ వెండింగ్ మెషీన్లు
-త్వరలో అందుబాటులోకి తేనున్న ఆర్బీఐ -12 నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు విధాత: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్లను అందుబాటులోకి తేనున్నది. బుధవారం ద్రవ్యసమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 12 నగరాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ మెషీన్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రజలకు నాణేల అవసరాలను తీర్చడానికే ఈ మెషీన్లని తెలియజేశారు. ప్రస్తుతమున్న కాయిన్ వెండింగ్ మెషీన్లకు ఈ మెషీన్లు పూర్తి […]

-త్వరలో అందుబాటులోకి తేనున్న ఆర్బీఐ
-12 నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు
విధాత: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్లను అందుబాటులోకి తేనున్నది. బుధవారం ద్రవ్యసమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 12 నగరాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ మెషీన్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు.
ప్రజలకు నాణేల అవసరాలను తీర్చడానికే ఈ మెషీన్లని తెలియజేశారు. ప్రస్తుతమున్న కాయిన్ వెండింగ్ మెషీన్లకు ఈ మెషీన్లు పూర్తి విరుద్ధంగా పనిచేస్తాయి. కరెన్సీ నోట్లకు బదులుగా యూపీఐ ద్వారా కస్టమర్ ఖాతా నుంచి నగదును మినహాయించుకొని నాణేలను అందిస్తాయి.
కాయిన్లు కావాలనుకునేవారు మెషీన్‌లో కరెన్సీ నోట్లను పెట్టనవసరం లేదన్నమాట. ఈ మేరకు బ్యాంకులకు త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని ఆర్బీఐ గవర్నర్ దాస్ తెలిపారు. ఇక తాజా ద్రవ్యసమీక్షలో రెపోరేటును పావు శాతం పెంచి 6.5 శాతానికి ఆర్బీఐ చేర్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) వృద్ధిరేటు 6.4 శాతంగా ఉంటుందని, ద్రవ్యోల్బణం 5.3 శాతానికి పడిపోగలదని ఆర్బీఐ అంచనా వేసింది.