Surya family l సూర్య ఫ్యామిలీలో గొడవలు.. కారణం ఇదేనా?
Quarrels in the Surya family.. Is this the reason? విధాత: తమిళ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్బింగ్ అవుతాయి. ఇలా సూర్య సినిమాలకు, ఆయనకు తెలుగులో మంచి ఆదరణ, అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నటుడిగా సూర్య మంచి స్థాయిలో ఉన్నారు […]
Quarrels in the Surya family.. Is this the reason?
విధాత: తమిళ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్బింగ్ అవుతాయి. ఇలా సూర్య సినిమాలకు, ఆయనకు తెలుగులో మంచి ఆదరణ, అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నటుడిగా సూర్య మంచి స్థాయిలో ఉన్నారు అంటే.. అందుకు కారణం ఆయన నటన మాత్రమే కాదు.. మంచి మనసుతో ఆయన చేసే సేవలు కూడా.

సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద చిన్నారులను చేరదీసి వారి చదువులు బాగోగులు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఈయన తండ్రితో పాటు తన సోదరుడితో కలిసి ఈ ఫౌండేషన్‌ను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇలా కుటుంబంతో కలిసి ఎంతో సరదాగా సంతోషంగా ఉండే సూర్య కుటుంబంలో గత కొంతకాలంగా విభేదాలు ఏర్పడ్డాయని తెలుస్తుంది. ఆ విభేదాల కారణంగానే సూర్య తన కుటుంబం నుంచి విడిపోయారు అనే వార్త కోలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. మరో విషయం ఏమిటంటే.. సూర్య కుటుంబంలో విభేదాలు రావడానికి గల కారణం సూర్య భార్య జ్యోతిక అని అంటున్నారు.

వాస్తవానికి జ్యోతికను సూర్య పెళ్లి చేసుకోవడం ఆయన తండ్రి శివకుమార్‌కు ఏమాత్రం ఇష్టం లేదని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇష్టం లేకపోయినా తనని కోడలుగా అంగీకరించారు. ఇలా పెళ్లి తర్వాత ఇంటిపట్టునే ఉంటున్న జ్యోతిక.. తిరిగి సినిమాలలో నటిస్తోంది. ఆమె మళ్లీ నటించడం ఇష్టంలేని శివకుమార్ ఈ విషయం గురించి తరచూ గొడవ చేస్తూ ఉన్నారట. ఇలా తన తండ్రి తన భార్య పట్ల గొడవ పడటంతో సూర్య తన ఫ్యామిలీతో పాటు వేరుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక సూర్య.. తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి ముంబైలో నివసించబోతున్నారని.. ఇప్పటికే ముంబైలో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశారని వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ.. ఈ వార్తలపై సూర్య అండ్ ఫ్యామిలీ మాత్రం ఎక్కడా స్పందించలేదు. మరి విషయం ఏమై ఉంటుందో తెలియాల్సి ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram