R S Shivaji | స్నేహితుడిని కోల్పోయా.. ఫుల్ ఎమోషనల్ అయిన కమల్ హాసన్
R S Shivaji | ఈ రోజు సినీ పరిశ్రమలో అతి పెద్ద విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ ఆర్ఎస్ శివాజీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు. ప్రస్తుతం శివాజీ వయస్సు 66 సంవత్సరాలు కాగా, ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. శివాజీ పేరుకు తమిళ నటుడే అయినా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. డబ్బింగ్ సినిమాల ద్వారా […]

R S Shivaji |
ఈ రోజు సినీ పరిశ్రమలో అతి పెద్ద విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ ఆర్ఎస్ శివాజీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు. ప్రస్తుతం శివాజీ వయస్సు 66 సంవత్సరాలు కాగా, ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
శివాజీ పేరుకు తమిళ నటుడే అయినా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. డబ్బింగ్ సినిమాల ద్వారా బాగా దగ్గరయ్యారు. చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో కానిస్టేబుల్ మాలోకం పాత్ర పోషించి చాలా అలరించాడు. అందులో ఆయన ‘నేను ఎక్కడికో వెళ్లిపోతున్నా’ అని చెప్పిన డైలాగ్ ప్రతి ఒక్కరి మదిలో అలా నిలిచిపోయింది.
కమల్ హాసన్ నటించినఅపూర్వ సహోదరులు, మైఖేల్ మదన కామరాజు, గుణ, భామనే సత్యభామనే, సత్యమేశివం వంటి సినిమాల్లో కమల్‌తో ఎక్కువగా నటించారు. రీసెంట్‌గా రిలీజైన సాయి పల్లవి గార్గి చిత్రంలో ఆమె తండ్రిగా కనిపించారు.
ఇక కమల్ హాసన్ సూపర్ హిట్ విక్రమ్ సినిమాలోనూ, అంతకుముందు సూర్య హీరోగా తెరకెక్కిన ఆకాశమే హద్దుగా మూవీలో , యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన లక్కీ మ్యాన్‌లో నటించిన శివాజి తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూఆయడంతో కమల్ హాసన్ ఎమోషనల్ అయ్యారు. తన ట్విట్టర్ వేదికగా సంతాపం తెలియజేశారు.
నా స్నేహితుడు , గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్.ఎస్. శివాజీ మరణ వార్త విని చాలా బాధపడ్డాను. చిన్న పాత్రే అయినా అభిమానులకు చిరకాలం ఉండేలా ప్రాణం పోసే సత్తా ఆయన సొంతం. అతను మా రాజ్‌కమల్ ఫిల్మ్స్ కుటుంబ సభ్యుడిగా మంచి గుర్తింపు పొందాడు. అతనిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు నా సానుభూతి తెలియజేస్తున్నానని కమల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక 1956లో చెన్నైలో ఆర్ఎస్ శివాజీ జన్మించగా, ఆయన 1981లో పన్నీర్ పుష్పాలు చిత్రంతో తెరగ్రేటం చేశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో నటుడిగా, కమెడియెన్ తనదైన ముద్ర వేసి తమిళంలో వందకుపైగా చిత్రాల్లో నటించారు. పలు సీరియల్స్‌లో కూడా నటించి మెప్పించాడు శివాజి.