Rahul Gandhi | విమానాశ్ర‌యంలో.. రెండు గంట‌లు క్యూలో నుంచున్న రాహుల్‌గాంధీ

Rahul Gandhi | విధాత: అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన రాహుల్ గాంధీ.. విమానాశ్ర‌యంలో ఇమిగ్రేష‌న్ క్లియ‌రెన్స్ కోసం క్యూలో నుంచోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. '16 గంట‌ల సుదీర్ఘ విమాన ప్ర‌యాణం అనంత‌రం రాహుల్.. శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్టులో రెండు గంట‌లు క్యూలో నుంచున్నారు' అని కాంగ్రెస్ నాయ‌కుడు ప్ర‌వీణ్ చ‌క్ర‌వ‌ర్తి ట్వీట్ చేశారు. After a 16 hour flight, waited another 2 hours at San Francisco airport for immigration with @RahulGandhi, who was […]

  • By: krs |    latest |    Published on : Jun 01, 2023 7:27 AM IST
Rahul Gandhi | విమానాశ్ర‌యంలో.. రెండు గంట‌లు క్యూలో నుంచున్న రాహుల్‌గాంధీ

Rahul Gandhi |

విధాత: అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన రాహుల్ గాంధీ.. విమానాశ్ర‌యంలో ఇమిగ్రేష‌న్ క్లియ‌రెన్స్ కోసం క్యూలో నుంచోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

’16 గంట‌ల సుదీర్ఘ విమాన ప్ర‌యాణం అనంత‌రం రాహుల్.. శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్టులో రెండు గంట‌లు క్యూలో నుంచున్నారు’ అని కాంగ్రెస్ నాయ‌కుడు ప్ర‌వీణ్ చ‌క్ర‌వ‌ర్తి ట్వీట్ చేశారు.

క్యూలో నుంచుని ఉన్న రాహుల్ గాంధీతో మిగిలిన ప్ర‌యాణికులు సెల్ఫీలు తీసుకోడానికి పోటీప‌డ్డారు. మీరెందుకు లైన్‌లో వెయిట్ చేస్తున్నార‌ని అడ‌గ‌గా.. ‘ఇప్పుడు నేను సాధార‌ణ పౌరుడిని. ఎంపీని కాదుగా అని రాహుల్ న‌వ్వుతూ స‌మాధాన‌మిచ్చారు.

పరువు న‌ష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష ప‌డ‌టంతో.. వాయ‌నాడ్ ఎంపీగా ఉన్న ఆయ‌న అన‌ర్హ‌త వేటుకు గురైన విష‌యం తెలిసిందే. దానివ‌ల్ల దౌత్య పాస్‌పోర్టు స్థానంలో సాధార‌ణ పాస్‌పోర్టుతో ప్ర‌యాణించారు.

మ‌రోవైపు రాహుల్ గాంధీకి ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ కాంగ్రెస్ ఛైర్‌ప‌ర్స‌న్ శ్యాం పిట్రోడా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. యూఎస్‌లో రాహుల్‌గాంధీ ప‌ర్య‌ట‌న 10 రోజుల పాటు సాగ‌నుంది.