Rahul Gandhi | చైనా మ‌న భూమిని లాక్కున్న‌ది: రాహుల్‌గాంధీ

లడఖ్‌లోని ప్రతి వ్యక్తికి ఇది తెలుసు కానీ, ప్ర‌ధాని మోదీ ఇంచు కూడా చైనా ఆక్ర‌మించుకోలేద‌ని బుకాయిస్తున్న‌రు కాంగ్రెస్ సీనియ‌ర్ రాహుల్‌గాంధీ ఫైర్‌ Rahul Gandhi | విధాత‌: కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ మ‌రోసారి స‌రిహ‌ద్దు అంశాన్నిలేవ‌నెత్తారు. చైనా మ‌న భూమిని ఆక్ర‌మించింద‌ని, అయినా ప్ర‌ధాని మోదీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. పైగా ఇంచు కూడా ఆక్ర‌మ‌ణ‌కు గురికాలేద‌ని బుకాయిస్తున్నార‌ని రాహుల్ మండిప‌డ్డారు. త‌న తొమ్మిది రోజుల లడఖ్ పర్యటనలో చివరి రోజు శుక్ర‌వారం అక్క‌డ […]

  • By: Somu    latest    Aug 25, 2023 12:41 AM IST
Rahul Gandhi | చైనా మ‌న భూమిని లాక్కున్న‌ది: రాహుల్‌గాంధీ
  • లడఖ్‌లోని ప్రతి వ్యక్తికి ఇది తెలుసు
  • కానీ, ప్ర‌ధాని మోదీ ఇంచు కూడా
  • చైనా ఆక్ర‌మించుకోలేద‌ని బుకాయిస్తున్న‌రు
  • కాంగ్రెస్ సీనియ‌ర్ రాహుల్‌గాంధీ ఫైర్‌

Rahul Gandhi | విధాత‌: కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ మ‌రోసారి స‌రిహ‌ద్దు అంశాన్నిలేవ‌నెత్తారు. చైనా మ‌న భూమిని ఆక్ర‌మించింద‌ని, అయినా ప్ర‌ధాని మోదీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. పైగా ఇంచు కూడా ఆక్ర‌మ‌ణ‌కు గురికాలేద‌ని బుకాయిస్తున్నార‌ని రాహుల్ మండిప‌డ్డారు. త‌న తొమ్మిది రోజుల లడఖ్ పర్యటనలో చివరి రోజు శుక్ర‌వారం అక్క‌డ జ‌రిగిన స‌భ‌లో మాట్లాడారు. చైనా మ‌న భూమిని లాక్కుంద‌ని లడఖ్‌లోని ప్రతి వ్యక్తికి తెలుసని, కానీ, ఒక్క అంగుళం భూమిని తీసుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నార‌ని, ఇది పూర్తిగా అబ‌ద్ధ‌మ‌ని పేర్కొన్నారు.

జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య భేటీ తర్వాత రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది.

“గత వారం నేను నా మోటార్‌సైకిల్‌పై లడఖ్ మొత్తం సందర్శించాను. లడఖ్ ఒక వ్యూహాత్మక ప్రదేశం. నేను పాంగాంగ్ సరస్సు వద్ద ఉన్నప్పుడు, చైనా వేల కిలోమీటర్ల భారత భూమిని ఆక్రమించిందనే విషయం స్పష్టమైంది. దురదృష్టం ఏమిటంటే.. ప్రధానమంత్రి మోదీ మాత్రం మా భూమిలో ఒక్క అంగుళం కూడా చైనా తీసుకోలేదని ప్రకటన చేయడం. ఆయ‌న మాట‌ పూర్తిగా అబద్ధం” అని రాహుల్‌గాంధీ విమ‌ర్శించారు.