Flying kiss | రాహుల్‌కు యువతుల కొరతేం లేదు.. ముసలావిడకు ఫ్లయింగ్ కిస్ ఎందుకు ఇస్తారు?: మహిళా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
Flying kiss | పార్లమెంటులో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫ్లయింగ్ కిస్ ఇచ్చారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దీనిపై వివిధ పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బిహార్‌కు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి యువతుల కరవు ఏమీ లేదని.. ఆయన కన్ను కొట్టాలంటే ఏ అందమైన యువతికైనా కొడతారు కానీ.. 50 ఏళ్ల ముసలావిడకు ఎందుకు కొడతారని ప్రశ్నించారు. ఈ ఆరోపణలన్నీ అర్థం […]

Flying kiss |
పార్లమెంటులో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫ్లయింగ్ కిస్ ఇచ్చారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దీనిపై వివిధ పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బిహార్‌కు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీకి యువతుల కరవు ఏమీ లేదని.. ఆయన కన్ను కొట్టాలంటే ఏ అందమైన యువతికైనా కొడతారు కానీ.. 50 ఏళ్ల ముసలావిడకు ఎందుకు కొడతారని ప్రశ్నించారు. ఈ ఆరోపణలన్నీ అర్థం లేని వని కాంగ్రెస్ నుంచి ఎన్నికైన నీతూ సింగ్ వ్యాఖ్యానించారు.
ఈ మహిళా ఎమ్మెల్యే వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ట్వీట్ చేశారు. రాహుల్ జుగుప్సాకర ప్రవర్తనను ఆ పార్టీ మహిళా నేతలు కూడా సమర్థిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతకు ముందు పార్లమెంటులో మహిళా ఎంపీలను చూసి రాహుల్ ఫ్లయింగ్ కిస్ (Flying Kiss) ఇచ్చారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై విచారణ చేయాలని కోరుతూ.. స్పీకర్‌కు పలువురు మహిళా ఎంపీలు ఫిర్యాదు సైతం చేశారు. తనను చూసి గేళి చేస్తున్న బీజేపీ ఎంపీలకు సోదర భావంతోనే రాహుల్ ఆ సంజ్ఞ చేశారని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది.